నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టిలేషన్(ఎన్ఏవీఐసీ) సాంకేతిక వ్యవస్థను తమ స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానం చేయనున్నట్లు స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమీ తెలిపింది. దీనికోసం ఇస్రోతో ఒప్పందాన్ని కుదుర్చుకున్న షియోమీ.. 2020లోనే అందుబాటులోకి తెస్తామని పేర్కొంది.
ఇస్రో రూపొందించిన ప్రాంతీయ జియో పొజిషనింగ్ సిస్టమ్ నగర ప్రధాన కార్యాలయం ద్వారా ఈ సాంకేతికత అందుబాటులోకి రానుంది.
ఇప్పటిదాకా క్వాల్కమ్లోనే...
ఇలాంటి సాంకేతికతను ఇప్పటిదాకా అమెరికాకు చెందిన క్వాల్కమ్ టెలికాం సంస్థ మాత్రమే ప్రారంభించింది. క్వాల్కమ్ అందించే స్నాప్ డ్రాగన్ మొబైల్ ప్లాట్‌ఫాం సేవలను.. దేశ వ్యాప్తంగా షియోమీ కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. విభిన్న ధరల్లో స్నాప్ డ్రాగన్ చిప్సెట్లతో కూడిన స్మార్ట్ఫోన్లు ఎన్ఏవీఐసీ మద్దతుతో అందుబాటులోకి రానున్నాయి.
అయితే.. ఈ సాఫ్ట్వేర్ కోసం మరిన్ని పరిశోధనలు అవసరమని షియోమీ భావించింది. దేశవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ సేవలను అభివృద్ధిపరిచేందుకు ఇస్రో సాంకేతికతను ఉపయోగించడం ఇదే తొలిసారి.
కచ్చితమైన మ్యాపింగ్...
వినియోగదారుల అవరసం మేరకు స్మార్ట్‌ఫోన్‌లో కొన్ని ఆప్షన్స్‌ను రూపొందించారు. అందులోని ఓ ప్రత్యేక 'కీ' ద్వారా ఆడియో, వీడియోలతో సహా కచ్చితమైన మ్యాపింగ్‌ను పొందే అవకాశం ఉంటుంది.
షియోమీ నిర్ణయాన్ని స్వాగతించారు ఇస్రో ఛైర్మన్ శివన్. తమ సేవలను మరింత విస్తరించేందుకు ఎప్పుడైనా సిద్ధమని ప్రకటించారు.
'ఎన్ఏవీఐసీ సాధనల్లో ఇది కీలకమైన ముందడుగు. దేశ అభివృద్ధి కోసం అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం, దానిని అందరికీ అందుబాటులో తీసుకురావడం మంచి ఆలోచన. నూతన సాంకేతికతో భారత్‌లో షియోమీ మరింత వృద్ధిని సాధిస్తుంది.'
- కె.శివన్, ఇస్రో ఛైర్మన్
ఇదీ చదవండి: భారత మార్కెట్లోకి మరో 5జీ ఫోన్- ధర కాస్త ఎక్కువే!