ETV Bharat / business

దాతృత్వంలో అజీమ్ ప్రేమ్​జీదే అగ్రస్థానం! - దేశంలో అత్యంత దానిశీలులు

సొంత లాభం కొంత మానుకో అన్న నానుడికి దేశ వ్యాపార వేత్తలు నిదర్శనంగా నిలుస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం అత్యధిక దానాలు చేసిన సంపన్నుల జాబితాలో విప్రో అధినేత అజీమ్​ ప్రేమ్​జీ అగ్ర స్థానంలో నిలిచారు. ఈ కాలంలో ప్రేమ్​జీ రోజువారీగా చూస్తే రూ.22 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు ఓ నివేదిక తెలిపింది. ఈ జాబితాలో శివ్​నాడార్, ముకేశ్ అంబానీలు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.

Azim Premji Topped in philanthropy
అత్యంత దానశీలుడిగా అజీమ్​ ప్రేమ్​ జీ
author img

By

Published : Nov 10, 2020, 5:31 PM IST

దేశంలో అత్యంత ఔదార్యం కలిగిన సంపన్నుడిగా ఐటీ దిగ్గజం విప్రో అధినేత అజీమ్​ ప్రేమ్​జీ నిలిచారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ప్రేమ్​జీ రూ.7,904 కోట్లను విరాళంగా ఇచ్చారు. అంటే ఏడాది పొడవున రోజుకు రూ.22 కోట్లు చొప్పున ఇచ్చినట్లు లెక్క. ఇంతకు ముందు ఈ రికార్డు హెచ్​సీఎల్​ టెక్​ అధినేత శివ్ నాడార్​ పేరిట ఉండేది.

గత ఆర్థిక సంవత్సరం శివ్​ నాడార్ రూ.795 కోట్లు విరాళమిచ్చి రెండో స్థానంలో నిలిచారు. 2018-19లో శివ్​ నాడార్​ రూ.826 కోట్లు దానం చేసి అగ్రస్థానంలో నిలవగా.. ప్రేమ్​జీ రూ.458 కోట్లు దానం చేశారు.

ఈ జాబితాలో దేశంలోనే అత్యంత ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మూడో స్థానంలో నిలిచారు. ముకేశ్ 2019-20 కాలంలో రూ.458 కోట్లు విరాళమివ్వగా.. అంతకుముందు రూ.402 కోట్లు దానంగా ఇచ్చారు.

ఈ వివరాలన్ని హరూన్ రిపోర్ట్ ఇండియా, ఎడిల్​గేవ్ ఫౌండేషన్​ రూపొందించిన నివేదికలో వెల్లడయ్యాయి.

నివేదికలో మరిన్ని వివరాలు..

  • కరోనా సంక్షోభంలో కార్పొరేట్ దిగ్గజాలు తమ దాతృత్వాన్ని చాటుకున్నాయి. ఇందులో టాటా సన్స్​ రూ.1,500 కోట్లు విరాళంగా ఇచ్చి అగ్రస్థానలో నిలవగా.. అజీమ్​ ప్రేమ్​జీ రూ.1,125 కోట్లు, అంబానీ రూ.510 కోట్లు ఇచ్చారు.
  • పీఎంకేర్స్​కు రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.500 కోట్లు, ఆదిత్య బిర్లా గ్రూప్ రూ.400 కోట్లు, టాటా గ్రూప్ రూ.500 కోట్లు విరాళమిచ్చారు.
  • మరో టెక్​ దిగ్గజం ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకులు నందన్ నీలేకని (రూ.159 కోట్లు), ఎస్.గోపాలకృష్ణన్​ (రూ.50 కోట్లు), ఎస్​.డి.శిభులాల్ (రూ.32 కోట్లు) ఈ జాబితాలో చోటు సంపాదించారు.
  • రూ.5 కోట్లకుపైగా విరాళమిచ్చిన 109 మంది వ్యక్తిగత దాతల్లో 7 మంది మహిళలు ఉన్నారు.
  • ఫ్లిప్​కార్ట్ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సాల్ రూ.5.3 కోట్లు విరాళమిచ్చారు. అత్యంత పిన్న వయసున్న వ్యక్తిగత దాతగా నిలిచారు.

ఇదీ చూడండి:పెరిగిన ధరలతో బంగారు రుణాలకు భలే డిమాండ్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.