దేశీయ ఐటీ దిగ్గజం విప్రో సీఈఓ థియరీ డెలాపోర్ట్ 2020-21లో రూ.64.3 కోట్ల వేతన ప్యాకేజీని అందుకున్నట్లు కంపెనీ వార్షిక నివేదికలో పేర్కొంది. జూలై 6, 2020-మార్చి 31 2021 మధ్య లెక్కించే ఈ మొత్తంలో.. వన్-టైమ్ క్యాష్ అవార్డు, వార్షిక స్టాక్ గ్రాంట్, ఆర్‌ఎస్‌యూల రూపంలో అందుకున్నట్లు వెల్లడించింది.
భారత ఐటీ రంగంలో అత్యధిక పారితోషికం తీసుకునే సారథుల్లో విప్రో సీఈఓ ఒకరు. మాజీ కాప్జెమినీ ఉద్యోగి అయిన డెలాపోర్ట్.. గతేడాది జూలై 6న విప్రో సీఈఓ, ఎండీగా బాధ్యతలు చేపట్టారు.
ఇక 2020-21కి గాను ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ రూ.49.68 కోట్ల వార్షిక ప్యాకేజీ అందుకున్నారు. దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ సీఈఓ, ఎండీ రాజేష్ గోపీనాథన్ 2020-21లో రూ 20.36 కోట్ల వేతన ప్యాకేజీని తీసుకున్నారు. మరోవైపు 2020 జూన్ 1న విప్రో సీఈఓ, ఎండీ పదవులకు రాజీనామా చేసిన అబిదాలీ నీముచ్‌వాలా 3,05,845 అమెరికన్ డాలర్లు పరిహారాన్ని అందించింది విప్రో.
ఇవీ చదవండి: టీసీఎస్ సీఈఓ జీతం రూ.20.36 కోట్లు