దేశ ఆర్థిక వృద్ధి మందగమనానికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దేశంలోని వివిధ రంగాలు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు ప్రభుత్వం సాధ్యమైనంత సహకారం అందిస్తుందని కోల్‌కతాలో హామీ ఇచ్చారు.
"వివిధ రంగాలు ఎదుర్కొంటున్న సవాళ్లను మేము పరిశీలిస్తూనే ఉన్నాం. సమస్యల పరిష్కారానికై నిరంతరం వాటితో చర్చలు జరుపుతున్నాం. ఆయా రంగాలకు సాధ్యమైనంత సహాయమూ అందిస్తాం."
- నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థికమంత్రి
ఆర్బీఐ ఇచ్చిన నిధుల సంగతేంటి?
ఇటీవల ఆర్బీఐ తన డివిడెండ్, మిగులు నిల్వల్లోని 1.76 లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేసింది. అయితే వీటిని ఎలా ఉపయోగించాలనే విషయంలో ప్రభుత్వం ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
విజయ దశమి నుంచి..
పన్ను చెల్లింపుదారుల విషయంలో ఫేస్‌లెస్ అసెస్మెంట్, ర్యాండమ్ స్క్రూటినీ విధానాన్ని విజయ దశమి నుంచే అమలుచేయనున్నట్లు తెలిపారు నిర్మల.
ఇదీ చూడండి: గగన్‌యాన్: వ్యోమగాముల ఎంపికలో తొలిదశ పూర్తి