WPI Inflation: టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్భణం (డబ్ల్యూపీఐ) డిసెంబర్లో తగ్గింది. నవంబర్ నెలలో 14.23 శాతం ఉండగా.. డిసెంబర్లో 13.56శాతంగా నమోదైంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఈ మేరకు వెల్లడించింది.
గతేడాది అక్టోబర్‌లో 13.83శాతంగా ఉన్న టోకు ద్రవ్యోల్భణం నవంబర్‌లో 14.23శాతానికి పెరిగింది. డిసెంబర్లో కాస్త తగ్గింది. అయితే 2020 డిసెంబర్‌తో పోల్చితే ఇది చాలా ఎక్కువ. వంటనూనెల ధరలు, లోహాలు, గ్యాస్, కెమికల్స్ ధరలు భారీగా పెరగడం వల్ల టోకు ద్రవ్యోల్భణం గరిష్ఠ స్థాయికి చేరుతూ వస్తోంది. 2020 డిసెంబర్లో ఇది 1.95 శాతమే కావడం గమనార్హం.
ఇదీ చదవండి: Demat Nominee: డీమ్యాట్ ఖాతా నామినీ పేరు రాశారా?