ETV Bharat / business

కోకాకోలాకు యజమాని ఎవరో తెలుసా?

ఏ కంపెనీకి లేనంత ప్రాచుర్యం ఆ సంస్థ సొంతం. చిన్నబడ్డీ కొట్టువాడి దగ్గర నుంచి దేశాధ్యక్షుల వరకూ దాని పేరు తెలియని వారు ఎవ్వరూ ఉండరు. 200 దేశాల్లో ఆ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇప్పటివరకు లెక్కకు మించిన ఫ్లేవర్లను వినియోగదారులకు పరిచయం చేసింది.. చేస్తోంది. అలాంటి సంస్థకు ఓనర్​ అంటూ ఎవరు లేరంటే నమ్మగలమా? కానీ ఇది నిజం. ఆ సంస్థే కోకాకోలా.

Coca-Cola Company
కోకాకోలా
author img

By

Published : Jul 27, 2021, 8:15 AM IST

కోకాకోలా.. ఈ పేరు తెలియని వారంటూ ఎవ్వరూ ఉండరు. వివిధ దేశాల్లో రవి అస్తమించని సామ్రాజ్యంగా ఏళ్ల తరబడి ఈ సంస్థ ప్రస్థానం కొనసాగుతోంది. సుమారు 200లకు పైగా దేశాల్లో ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తూనే ఉంది. ప్రపంచంలో అది పెద్ద శీతల పానీయం తయారీ సంస్థగా దీనికి పేరుంది. అయితే ఈ సంస్థకు యజమాని ఎవరో మీకు తెలుసా?

Coca-Cola Company
కోకాకోలా పరిణామక్రమం

కొన్ని వేలకోట్ల టర్నోవర్​ ఉన్న ఈ కంపెనీకి యాజమాన్యం అయితే ఉంది కానీ.. సొంత యజమాని అంటూ ఎవరూ లేరు. ఈ సంస్థను తొలుత 1886లో జాన్​ స్టిత్ పెంబర్టన్ అనే ఫార్మసిస్ట్ ప్రారంభించారు. అప్పటి నుంచి కోకాకోలా ఉత్పత్తి నిర్విరామంగా సాగుతోంది.

Coca-Cola Company
కోకాకోలా డ్రింక్స్​

యజమాని లేని సంస్థ...

ఈ సంస్థకు ప్రారంభంలో ఓనర్​ ఉన్నా.. అనంతరం చోటుచేసుకున్న మార్పుల్లో కేవలం యాజమాన్యం వరకే మాత్రమే పరిమితమైంది. ఇది అమెరికాలో పబ్లిక్​ లిస్టేడ్​ కంపెనీ. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది షేర్​హోల్డర్లు, పెట్టుబడుదారులు ఈ సంస్థకు ఉన్నారు. దీనికి అన్ని సంస్థల్లాగే బోర్డు ఉంది. దానిలో డైరెక్టర్లు ఉన్నారు. సంస్థకు చాలామంది ప్రొమోటర్లు కూడా ఉన్నారు. కంపెనీకి సంబంధించిన కీలక నిర్ణయాలు అన్నీ బోర్డులో చర్చించి సభ్యులు ఖరారు చేస్తారు. కానీ సొంతంగా యజమాని అంటూ ఎవరూ లేరు.

సంస్థలో ఎవరి వాటాలు ఎలా ఉన్నా.. అతి పెద్ద వాటాదురుడిగా మాత్రం ప్రపంచ బిలియనీర్​ వారెన్​ బఫెట్​ కొనసాగుతున్నారు. దీనిలో 9.3 శాతం వాటాను ఆయన కొనుగోలు చేశారు.

Coca-Cola Company
కోకాకోలా బాటిల్​

200 దేశాలు.. 800 ఫ్లేవర్లు..

కోకాకోలా సంస్థ ప్రారంభంలో సిరప్​గా తయారు చేశారు. ఇది తలనొప్పికి బాగా పనిచేసేదట. ఆ తరువాత జరిగిన పరిణామాలతో కూల్​డ్రింక్​గా ఆవిర్భవించింది. ఈ కంపెనీకి 200పైగా దేశాల్లో వినియోగదారులు ఉన్నారు. మార్కెట్​లోకి ఇప్పటివరకు చాలా కంపెనీలు వచ్చినా.. వాటినంటిని తట్టుకుని తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఇందుకు కారణాలు లేకపోలేదు. కాలానుగుణంగా మార్కెట్​లో వచ్చిన మార్పులను, వినియోగదారులు అభిరుచులను ఎప్పటికప్పుడు ఒడిసిపడుతూ.. వాటికి అనుగుణంగా మార్పులు చేసుకుంటూ వచ్చింది. ఈ సంస్థ ఉత్పత్తి చేసే ఫ్లేవర్లను రోజుకొకటి చొప్పున రుచి చూడాలి అంటే సుమారు రెండు ఏళ్లు పడుతుందట. ప్రపంచ వ్యాప్తంగా 800 ఫ్లేవర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.

Coca-Cola Company
కోకాకోలా గాజు బాటిల్​

ఇవీ చూడండి:

36 ఏళ్ల తర్వాత కోకాకోలా​ రుచిలో మార్పు!

బెస్ట్​ బిఫోర్​- ఎక్స్​పైరీ డేట్.. ఈ రెండు ఒకటేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.