ETV Bharat / business

మే 15 నుంచి వాట్సాప్‌ కొత్త పాలసీ - what are the new WhatsApp privacy policy

ఈ ఏడాది మే 15 నుంచి కొత్త ప్రైవసీ పాలసీని అమల్లోకి తీసుకొస్తున్నట్లు ప్రముఖ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్​ తెలిపింది. కొత్త ప్రైవసీ పాలసీకి సంబంధించిన మరింత సమాచారాన్ని బ్యానర్‌ రూపంలో యూజర్‌కు కనిపించేలా ప్రదర్శిస్తామని పేర్కొంది. అయితే వీటిని అంగీకరించని వ్యక్తులు మెసేజ్​ పంపలేరని స్పష్టం చేసింది.

WhatsApp to offer more info on privacy policy update
మే 15 నుంచి వాట్సాప్‌ కొత్త పాలసీ
author img

By

Published : Feb 19, 2021, 10:30 PM IST

భారతీయ చట్టాలకు అనుగుణంగా వ్యక్తిగత గోప్యత పరిరక్షణకు కట్టుబడి ఉంటామని కేంద్ర ప్రభుత్వానికి వాట్సాప్‌ స్పష్టం చేసింది. ఈ మేరకు నూతన గోప్యతా విధానంపై తన వైఖరిని తెలియజేస్తూ ప్రకటన విడుదల చేసింది. మే 15 నుంచి కొత్త ప్రైవసీ పాలసీని అమల్లోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా కొత్త ప్రైవసీ పాలసీకి సంబంధించిన మరింత సమాచారాన్ని బ్యానర్‌ రూపంలో యూజర్‌కు కనిపించేలా ప్రదర్శిస్తామని పేర్కొంది. వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీని అంగీకరించని వారికి మే 15 తర్వాత కూడా ఎప్పటిలానే కాల్స్‌, నోటిఫికేషన్స్ వస్తాయి. కానీ వాళ్లు మెసేజ్‌లు మాత్రం పంపలేరని స్పష్టం చేసింది.

గత నెలలో వాట్సాప్ నూతన గోప్యతా విధానాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా వినియోగదారుల డేటాను ఫేస్‌బుక్‌తో పంచుకుంటున్నారని యూజర్స్ పెద్ద ఎత్తున్న ఆందోళన చేశారు. దీంతో తన నిర్ణయాన్ని మే 15కు వాయిదా వేస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. అంతేకాకుండా వాట్సాప్ కొత్త నిబంధనలు యూరప్‌లో ఒకలా.. భారత్‌లో మరోలా ఉన్నాయని, దీనిపై స్టే విధించాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం, డబ్బు కన్నా వ్యక్తిగత గోప్యతకే ప్రజలు ఎక్కువ విలువిస్తారని, వాట్సాప్ 2, 3 ట్రిలియన్ల విలువ గల కంపెనీ అయినప్పటికీ వ్యక్తిగత గోప్యత అంతకంటే విలువైందని వ్యాఖ్యానించింది. అప్పట్లో దీనిపై తమ వైఖరి తెలియజేయాలని వాట్సాప్‌కు, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

మరోవైపు ప్రైవసీ పాలసీలో మార్పులను ఉపసంహరిచుకోవాలని వాట్సాప్‌ను కేంద్రం ఆదేశించింది. ఏకపక్షంగా చేసిన మార్పులు ఆమోదయోగ్యం కాదని తెలిపింది. తాజాగా దీనిపై వాట్సాప్ వివరణ ఇస్తూ భారతీయ చట్టాలకు కట్టుబడి ఉంటామని కేంద్రానికి తెలిపింది.

"గత కొద్ది రోజులుగా వాట్సాప్ నూతన గోప్యతా విధానంపై అసత్యాలు ప్రచారంలో ఉన్నాయి. ఇప్పటికే దీనిపై మేం అధికారిక ప్రకటన చేశాం. కేవలం వాట్సాప్ బిజినెస్ ఖాతాలకు సంబంధించిన సమాచారం మాత్రమే ఫేస్‌బుక్‌తో షేర్ చేసుకుంటాం. అది కూడా యూజర్‌ అనుమతితోనే. వ్యక్తిగతంగా జరిగే సంభాషణలకు ఎండ్‌-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్‌ ఉంటుంది కాబట్టి వాటిని వాట్సాప్ చదవడం, వినడం చేయలేదు" అని మరోసారి స్పష్టం చేసింది.

ఇతర మెసేజింగ్ యాప్‌లపై కూడా వాట్సాప్ తన అసహనాన్ని వ్యక్తం చేసింది. "యూజర్స్ ఇతర యాప్స్ ఉపయోగించాలా వద్దా అనేది వారి స్వీయ నిర్ణయం. కానీ ఎండ్‌-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్ లేకుండా యూజర్స్ డేటాను చూడట్లేదు అని ప్రచారం చేసే యాప్‌ల గురించి యూజర్స్ ఆలోచించాలి. యూజర్స్ ఎల్లప్పుడూ నమ్మకమైన, భద్రతకు ప్రాధాన్యం ఉన్న యాప్‌లను ఉపయోగించేందుకే మొగ్గు చూపుతారు" అని తెలిపింది.

ఇదీ చూడండి: ప్రపంచ కుబేరుడిగా మళ్లీ ఎలాన్​ మస్క్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.