ETV Bharat / business

ఒక్క స్కాన్​తో నెంబర్​ సేవ్​.. వాట్సాప్​ నయా ఫీచర్​! - క్యూఆర్​ కోడ్​తో కాంటాక్ట్​ సేవ్​

కాంటాక్ట్​లను సేవ్​ చేసుకోవడానికి క్యూఆర్​ కోడ్​ స్కానింగ్​ ఫీచర్​ను అందుబాటులోకి తీసుకురానుంది వాట్సాప్​. ప్రస్తుతం దీన్ని బీటా వెర్షన్​లో పరీక్షిస్తున్నారు. ఈ ఆప్షన్​తో మాన్యువల్​గా సేవ్​ చేసుకోవాల్సిన ఫోన్​ నంబర్లు.. ఒక్క స్కాన్‌తో యాడ్‌ అయిపోతాయి.

WhatsApp testing new feature that helps to add contacts via QR codes
ఒక్క స్కాన్​తో కాంటాక్ట్​ సేవ్​.. వాట్సాప్​ నయా ఫీచర్​!
author img

By

Published : May 23, 2020, 2:50 PM IST

అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్..‌ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో వినియోగదారుల ముందుకు వస్తోంది. ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్‌ ఇప్పుడు మరో ఫీచర్​తో ఆకట్టుకునేందకు సిద్ధమైంది.

రాంగ్​ కాల్స్​కు అడ్డుకట్ట..!

సాధారణంగా ఎవరి ఫోన్‌ నెంబర్​ అయినా మనం సేవ్​‌ చేసుకోవాలంటే కాంటాక్ట్‌ మెనూకు వెళ్లి అక్కడ టైప్‌ చేసి.. యాడ్‌ కాంటాక్ట్‌ కొట్టి, ఆపై పేరు సేవ్‌ చేసుకుంటాం. ఒకట్రెండు నెంబర్లైతే ఓకే. అదే పదుల సంఖ్యలో ఉంటే? ఇలాంటి సందర్భాల కోసమే వాట్సాప్‌ ఈ సరికొత్త ఫీచర్‌ను తీసుకురాబోతోంది. పైగా మాన్యువల్‌గా టైప్‌ చేసేటప్పుడు కొన్నిసార్లు పొరపాటున ఒక నెంబర్‌కు బదులు మరో నెంబరుతో కాంటాక్ట్‌ ఫీడ్​‌ చేసుకునే పరిస్థితి కూడా ఉంది. ఇక నుంచి అలాంటి ఇబ్బందులకు చరమగీతం పాడవచ్చు.

ఎవరి నంబర్​ అయినా మన మొబైల్​లో సేవ్‌ చేసుకోవాలంటే వాట్సాప్‌లోని వాళ్ల క్యూర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే చాలు ఆటోమేటిక్‌గా ఆ కాంటాక్ట్‌ మన ఫోన్‌లో యాడ్‌ అయిపోతుంది. ప్రస్తుతం ఇది బీటా వెర్షన్‌లో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. వాట్సాప్‌ సెట్టింగ్స్‌ మెనులో ఈ ఆప్షన్‌ను తీసుకురానున్నారు. ఈ ఆప్షన్ అందుబాటులోకి వస్తే మాన్యువల్‌గా సేవ్‌ చేసుకోవాల్సిన కాంటాక్ట్‌లు ఒక్క స్కాన్‌తో యాడ్‌ అయిపోతాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.