ETV Bharat / business

ఇకపై వాట్సాప్​ సందేశాలు మాయం చేయొచ్చు! - Delete Messages feature in whatsapp

నిర్ణీత సమయం తరువాత మనం పంపిన, మన కొచ్చిన సందేశాలు వాటంతట అవే అదృశ్యం అయ్యే సరికొత్త ఫీచర్​ను వాట్సాప్.. తన ఆండ్రాయిడ్, ఐఓఎస్ బీటా వెర్షన్​లలో తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ సౌలభ్యాన్ని గ్రూప్ చాట్​లకే పరిమితం చేసింది. వీటిలోనూ గ్రూప్ అడ్మిన్​లు మాత్రమే ఈ సందేశాలు పంపించగలరని స్పష్టం చేసింది.

This is How WhatsApp ‘Delete Messages’ Will Work on Android, iOS
ఇకపై వాట్సాప్​ సందేశాలు మాయం చేయొచ్చు!
author img

By

Published : Dec 28, 2019, 6:41 PM IST

వాట్సాప్ సరికొత్త ఫీచర్​ను అందుబాటులోకి తీసుకొచ్చింది. నిర్ణీత సమయం తరువాత మనం పంపిన, మన కొచ్చిన సందేశాలు వాటికవే అదృశ్యం కావడం దీని ప్రత్యేకత.

బీటా వెర్షన్లకే పరిమితం...

వాట్సాప్​... ఆండ్రాయిడ్ బీటా వెర్షన్​ వినియోగదారులకు మాత్రమే ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఐఓఎస్​లో​ బీటా వెర్షన్​ 2.20.10.23 అప్​డేట్​లో ఈ ఫీచర్​ అందుబాటులోకి వచ్చింది.

గ్రూప్ చాట్​ల వరకే...

ప్రస్తుతం 'డిలీట్ మెసేజ్​' సౌలభ్యం గ్రూప్ చాట్​లకే పరిమితం.. వీటిలోనూ వాట్సాప్​ గ్రూప్ అడ్మిన్​లు మాత్రమే ఈ సందేశాలు పంపించగలరు. అయితే త్వరలో వ్యక్తిగత చాట్​లకూ ఈ ఫీచర్​ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

'సందేశాలను తొలగించు'

ఇంతకు ముందు 'అదృశ్యమయ్యే సందేశాలు'గా పేర్కొన్న వీటిని ఇప్పుడు 'డిలీట్ మెసేజ్' అంటున్నారు. డబ్ల్యూఏ బీటా ఇన్ఫో ప్రకారం, వాట్సాప్​ 'సందేశం' ఎంత సమయం కనిపిస్తోందో వినియోగదారులు ముందే చూడగలరు.

ఎంతో ఉపయోగం..

ఉదాహరణకు.. మీ గ్రూపులో ఒకరి పుట్టిన రోజుకు శుభాకాంక్షలు తెలపాలనుకుందాం. అందరూ సందేశాలు పంపిస్తారు. తరువాతి రోజు వాటి అవసరం ఉండదు. కనుక నిర్ణీత సమయం తరువాత అదృశ్యం అయ్యేలా మన సందేశాలు పంపించవచ్చు.

మరిన్ని ఫీచర్లు

డార్క్​ మోడ్​, ఫింగర్ ప్రింట్ లాక్​ సహా పలు ఫీచర్లను అందుబాటులోకి తెచ్చేందుకు వాట్సాప్​ కృషి చేస్తోంది. వినియోగదారుల గోప్యతను కాపాడేందుకు వాట్సాప్... ఫింగర్​ ప్రింట్ లాక్​ ఫీచర్​ను తీసుకురాబోతోంది. ఇప్పటికే టెలిగ్రామ్​, హైక్ వంటి పోటీ యాప్​లు ఈ దిశగా అడుగులు వేయడం గమనార్హం.

ఇదీ చూడండి: జనవరి 1 నుంచి ఎమ్​డీఆర్​ చెల్లింపులు ఉండవ్​!

Mumbai, Dec 28 (ANI): Bollywood actress Sonakshi Sinha was seen at airport in Mumbai on December 27. Several fans clicked selfies with her. Sonakshi looked funky in black choker and paired it with brown boots. On the other side, actress Huma Qureshi was also seen outside airport in casual look. She completed her airport look with a multi-coloured tracksuit and paired it with hoops. On work front, Huma will be next seen in 'Mumbai Saga' which will hit theatres in the coming year.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.