ఫిక్స్డ్ డిపాజిట్లు, పొదుపు ఖాతాలు, మ్యూచువల్ ఫండ్లు, ఈక్విటీలు ఇలా పెట్టుబడులకు అనేక సాధనాలున్నాయి. వీటితో వార్షికంగా వచ్చే రాబడిపై అంచనాలు ఉంటాయి. అయితే పెట్టిన పెట్టుబడి ఎన్ని సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది అన్నది చాలా మందికి ఉండే సందేహం. పెట్టుబడి రెట్టింపవ్వడానికి పట్టే సంవత్సరాలు తెలుసుకునేందుకు ఓ ఫార్ములా ఉంది. అదే రూల్ ఆఫ్ 72.
ఫార్ములా ప్రయోగించడం ఎలా..
ఉదాహరణకు మీరు 12 శాతం రాబడినిచ్చే సాధనంలో పెట్టుబడి పెట్టారనుకోండి. అప్పుడు 72ను 12 శాతంతో భాగించగా వచ్చిన ఫలితమే మీ పెట్టుబడి రెట్టింపయ్యే సమయం (సంవత్సరాల్లో).
ఫార్ములా ప్రకారం: 72/12=6
అంటే మీరు 12 శాతం రాబడినిచ్చే సాధనంలో పెట్టుపడి పెడితే అది 6 ఏళ్లలో రెట్టింపు అవుతుంది.
మూడు, నాలుగు రెట్లు అయ్యేందుకు?
మీ పెట్టుబడి మూడు రెట్లు పెరగటానికి పట్టే సంవత్సరాలను తెలుసుకునేందుకు 114తో భాగించాలి. అదే నాలుగు రెట్లు అయ్యేందుకు పట్టే సంవత్సరాలను తెలుసుకునేందుకు 144తో భాగించాలి.
ఈ ఫార్ములాల ప్రకారం 12 శాతం రాబడితో.. మీ పెట్టుబడి మూడు రెట్లు అయ్యేందుకు (114/12)= 9.5 సంవత్సరాలు పడుతుంది. నాలుగు రెట్లు అయ్యేందుకు (144/12)= 12 ఏళ్లు సమయం కావాలి.