ETV Bharat / business

ఇల్లు కట్టుకోవాలా, కొనుక్కోవాలా? ఏది మేలు​? - ఇంటి విషయంలో పన్ను ప్రయోజనాలు

ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు అనేది చిరకాల కోరిక. జీవితం మొత్తం కష్టపడి సంపాదించిన డబ్బుతో కలల పొదరింటిని నిర్మించుకుంటారు. ప్రస్తుతం తక్కువ వడ్డీ రేట్ల కాలం నడుస్తోంది. దీనితో చాలా మంది ఇల్లు కొనుగోలు చేసేందుకు, నిర్మించుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే ఇంటిని కొనుగోలు చేయటం ఉత్తమమా? నిర్మించుకోవటం మంచిదా? దీని గురించి తెలుసుకుందాం..

House
ఇల్లు కొనాలా.. కట్టించుకోవాలా.. ఏది బెటర్?​
author img

By

Published : May 14, 2021, 12:43 PM IST

ఇల్లు అంటే ఒకప్పుడు ఇండిపెండెంట్ ఇల్లు మాత్రమే. మారుతున్న పరిస్థితులు, ఆధునిక అవసరాలు ఇప్పుడు ఇంటి అర్థాన్నే మార్చేశాయి. నగరాలు పెరగటం వల్ల భూముల లభ్యత తగ్గిపోయింది. ఒకవేళ దొరికినా ధరలు ఎక్కువగా ఉంటున్నాయి. దీనితో అపార్ట్​మెంట్​లకు గిరాకీ పెరిగింది.

ఒక స్థలాన్ని తీసుకుంటే అందులో చాలా అపార్ట్​మెంట్​లు కట్టవచ్చు. అదే గృహం అయితే చాలా తక్కువగా కట్టాల్సి వస్తుంది. అయితే ఇప్పటికీ కొంత మంది ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇల్లు కట్టుకోవటం ఉత్తమమా? అపార్ట్​మెంట్​ తీసుకోవటం ఉత్తమమా? అనేది తేల్చుకోలేకపోతున్నారు.

ఇల్లు నిర్మించుకోవటం లేదా అపార్ట్​మెంట్​ కొనుగోలు అనేది వ్యక్తిగత విషయాలపై ఆధారపడి ఉంటుంది. వ్యక్తిగత ఆర్థిక పరిస్థితి, ఇతర అంశాలు ఈ నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయి. నిర్మాణం, కొనుగోలుపై ఈ విషయాలను పరిగణించాలి.

అందుబాటు..

ఇల్లు కట్టుకోవాలంటే భూమి అవసరం ఉంటుంది. భూమి ధర అనేది పూర్తిగా ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. నగరంలో అయితే భూముల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. అందులో నగరం లోపల చాలా తక్కువ ప్లాట్లు మాత్రమే కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. శివారు అయితే కొంత తక్కువ ధరకు పొందవచ్చు. అక్కడ విక్రయించే వారు కూడా ఎక్కువగా ఉంటారు.

ఇళ్లతో పోల్చితే నగరం లోపల, నగర శివారులో అపార్ట్​మెంట్​లు ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉంటాయి. నగరంలో అయితే అపార్ట్​మెంట్​ ధర చాలా ఎక్కువగా ఉంటుంది. ఇళ్లతో పోల్చితే అందుబాటు ధరలో అపార్ట్​మెంట్​​లను పొందటం సులువు.

అపార్ట్​మెంట్​ కొనుగోలు చేయాలంటే ఒకేసారి పెద్ద మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. లేకుంటే రుణం తీసుకొని ఈఎమ్ఐలు చెల్లించుకోవచ్చు. ఇంటి నిర్మాణ విషయంలో భూమి కొనుగోలు చేయాలంటే కూడా ఒకేసారి పెద్ద మొత్తంలో చెల్లించవచ్చు లేదా రుణం కూడా తీసుకోవచ్చు. అయితే విడతల వారీగా ప్రణాళిక ప్రకారం నిర్మాణం చేసుకుంటూ ఖర్చు పెట్టుకోవచ్చు. ఇంటి నిర్మాణం, భూమి కొనుగోలు వ్యయం కలుపుకుంటే భారీ మొత్తమే అవుతుంది.

తిరిగి విక్రయించటం..

ఇళ్లతో పోల్చితే అపార్ట్​మెంట్​లను విక్రయించటం కొంత సులభం. అపార్ట్​మెంట్​లకు డిమాండ్ స్థిరంగా ఉంటుంది. అయితే వీటి విషయంలో పొందే భూమి చాలా తక్కువగా ఉంటుంది. ఇంటిని విక్రయించటం కొంత కష్టమైన పని. ఇళ్లు అడుగు భూమి అలానే ఉంటుంది కాబట్టి కొత్త ఇల్లు కట్టుకోవటం కూడా సులభం.

భద్రత, ప్రైవసీ..

అపార్ట్​మెంట్​లో అయితే ఎల్లప్పుడూ సెక్యూరిటీ ఉంటుంది. దీనికి సంబంధించిన ఖర్చులు కూడా ఇతరులతో కలిసి పంచుకోవాల్సి ఉంటుంది. ఇల్లు కట్టుకున్నట్లయితే సెక్యూరిటీ తక్కువగా ఉండవచ్చు. ఈ విషయంలో పూర్తి ఖర్చు సొంత జేబు నుంచి పెట్టుకోవాలి. అపార్ట్​మెంట్​ అయితే పలు సౌకర్యాలను ఇతరులతో కలిసి పంచుకోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత ఇల్లు అయితే ప్రైవసీ ఎక్కువగా ఉంటుంది.

ఏది సులభం?

ఇల్లు కట్టుకోవాలంటే భూమి దగ్గర నుంచి ఆర్కిటెక్ట్​ను సంప్రదించటం, వివిధ రకాల అనుమతులు పొందటం, కాంట్రాక్టర్ల నియామకం... ఇలా అన్ని స్వతహాగా చేసుకోవాల్సి ఉంటుంది. అపార్టమెంట్​ అయితే బిల్డర్​ వీటన్నింటిని చూసుకుంటాడు.

కస్టమైజేషన్​..

సొంత ఇల్లు అయితే ఎక్కువ కస్టమైజ్ చేసుకోవచ్చు. అంటే ఇష్టమైన తీరులో ఇంటీరియర్ పొందవచ్చు. వివిధ రకాల సౌకర్యాలను కూడా అభిరుచికి అనుగుణంగా పొందవచ్చు. అపార్ట్​మెంట్​లో పవర్ బ్యాకప్, లిఫ్ట్ , సెక్యూరిటీ లాంటి సౌకర్యాలు ఉంటాయి. క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, జిమ్ లాంటి ప్రీమియం సౌకర్యాలను కూడా పొందవచ్చు. గెటెడ్ కమ్యూనిటీలో ఇండిపెండెంట్ ఇంటి విషయంలో కూడా వీటిని పొందవచ్చు. కానీ పూర్తి స్వతహాగా ఇంటిని నిర్మించుకున్నట్లయితే ఈ సౌకర్యాలను పొందే అవకాశాలు ఉండకపోవచ్చు.

పన్ను ప్రయోజనాలు..

అపార్ట్​మెంట్​ విషయంలో మొదటి సారి కొనుగోలు చేస్తున్న వారు పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. ఇంటి విషయంలో అయితే నిర్మాణం పూర్తైన ఏడాది నుంచి పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. నిర్మాణ సమయంలో చెల్లించిన వడ్డీని ఐదు సంవత్సరాల వ్యవధిలో సమాన మొత్తంలో ఆదాయం నుంచి మినహాయింపు తీసుకోవచ్చు. అంటే ఇల్లు నిర్మించుకున్నట్లయితే పన్ను ప్రయోజనాలు కొంత ఆలస్యంగా పొందాల్సి ఉంటుంది. భూమి కొనుగోలు చేసేందుకు తీసుకున్న రుణానికి చెల్లించిన వడ్డీని పన్ను ఆదాయంలో మినహాయింపు తీసుకోవచ్చు. అయితే ఆ స్థలం ఖాళీగా ఉండకూడదు.

రాబడి..

వ్యక్తిగత ఇంటిపై పెట్టిన పెట్టుబడి విషయంలో రాబడి పెరుగుతూ ఉంటుంది. ఇందులో భూమి విలువ పెరుగుతుంది. అదే సమయంలో ఇంటి విలువ తగ్గిపోతుంది. రాబడి పెంచుకునేందుకు తరచూ నిర్వహణ ఖర్చు భరించాల్సి ఉంటుంది. అపార్ట్​మెంట్​ల విషయంలో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్​లు తరచూ నిర్వహణ చేపడుతుంటాయి. అంతేకాకుండా అపార్ట్​మెంట్​కు డిమాండ్ స్థిరంగా ఉంటుంది. కాబట్టి స్థిర రాబడిని ఇస్తాయి.

వడ్డీ రేట్లు..

ప్రస్తుతం గృహ రుణ వడ్డీ రేట్లు తక్కువగానే ఉన్నాయి. ఇల్లు, భూమి కలిపితే ఎక్కువ రుణం తీసుకోవాల్సి ఉంటుంది. దీనితో పోల్చితే తక్కువ మొత్తానికే అపార్ట్​మెంట్​ను సొంత చేసుకోవచ్చు. ఇంటి నిర్మాణ విషయంలో ఎక్కువ రుణం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎక్కువ వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో అపార్ట్​మెంట్​కు సంబంధించి తక్కువ రుణం, తక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.

ప్రస్తుతం తక్కువ వడ్డీ రేట్ల కాలం ఉన్న దృష్ట్యా ఇంటిని కొనుగోలు చేసేందుకు చాలా మంది మొగ్గు చూపుతున్నారు. ఇండిపెండెంట్ గృహాలు నగరం లోపల దొరికే అవకాశం తక్కువ. కేవలం ఇంటినే పరిగణనలోకి తీసుకుంటే వ్యయం కూడా ఎక్కువగానే ఉంటుంది. దీనికి భూమి కొనుగోలు వ్యయం కలిపితే చాలా ఎక్కువ అవుతుంది.

ఇదీ చూడండి: కలల ఇంటి నిర్మాణంలో ఖర్చు తగ్గించే మార్గాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.