ETV Bharat / business

ఆర్థిక సేవల్లో నయా ట్రెండ్​ 'నియో బ్యాంక్​' - నియో బ్యాంక్ విశేషాలు

కొంత కాలంగా ఆర్థిక సేవల విషయంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. యూపీఐ రూపంలో డిజిటల్ పేమెంట్లు గణనీయంగా పెరిగాయి. సంప్రదాయ బ్యాంకింగ్ బదులుగా కొత్త తరహా బ్యాంకింగ్ నయా ట్రెండ్​గా మారింది. అదే నియో బ్యాంకింగ్. అసలేమిటి ఈ నియో బ్యాంకింగ్? ఇవి ఎలాంటి సేవలు అందిస్తాయి?

neo banks
నియో బ్యాంక్​లు
author img

By

Published : Sep 22, 2021, 8:29 AM IST

బ్యాంకింగ్​లో ఈ మధ్య కొత్త పదం వినబడుతోంది. అదే నియో బ్యాంకింగ్. వీటిని అందించే సంస్థలను నియో బ్యాంకులని అంటారు. మన దేశంలోనే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా దీనికి ఆదరణ దక్కుతోంది. ఆర్థిక సేవలను సులభతరం చేసే వ్యవస్థలనే నియో బ్యాంకులుగా పిలుస్తుంటారు.

కొవిడ్​ భయాలు సహా ఇతరత్రా కారణాలతో చాలా మంది బ్యాంక్​కు వెళ్లేందుకు పెద్దగా ఇష్టపడటం లేదు. ఇంటి వద్ద నుంచే బ్యాంక్​ సేవలు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే అలాంటి వారికి సేవలందించడంలో బ్యాంకులు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ లోటును భర్తీ చేసేందుకు నియో బ్యాంకులు పుట్టుకొచ్చాయి.

ఏమిటీ నియో బ్యాంకులు?

అధునాతన ఫిన్ టెక్ సంస్థలే ఈ నియో బ్యాంకులు. వీటికి భౌతికంగా ఎలాంటి బ్రాంచ్​లు ఉండవు. పూర్తిగా ఆన్​లైన్ ద్వారా సేవలు అందిస్తుంటాయి. పూర్తి స్థాయిలో డిజిటల్ లావాదేవీలు జరపాలనుకునే వారికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.

మొబైల్ ఫస్ట్ పేమెంట్స్, నగదు బదిలీలు, లోన్స్​ సేవలను ఆన్​లైన్​ ద్వారా అందిస్తాయి ఈ నియో బ్యాంక్​లు (ఫిన్​టెక్ సంస్థలు). వీటికి బ్యాంకింగ్ సేవలందించేందుకు ప్రత్యేక లైసెన్స్​ అనేది అవసరం లేదు. ఇందుకోసం బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుంటాయి ఈ ఫిన్​టెక్ కంపెనీలు.

ప్రయోజనాలు ఏమిటి?

సౌకర్యం, ఛార్జీలు తక్కువగా ఉండటం, ఒకే దగ్గర పలు రకాల సేవలు పొందటం, పర్సనలైజేషన్ లాంటివి నియో బ్యాంకులు విషయంలో ప్రయోజనాలు. ఇవి కస్టమైజ్డ్ బ్యాంకింగ్ సొల్యూషన్లను అందిస్తుంటాయి.

భద్రతా భయాలు అక్కర్లేదు..

ఇవి కృత్రిమ మేధ, బ్లాక్ చైన్, ఫేషియల్ ఐడెంటిఫికేషన్, బయో మెట్రిక్ లాంటి అత్యాధునిక సాంకేతితలను ఉపయోగిస్తుంటాయి. భవిష్యత్ తరం సాంకేతికత వల్ల భద్రత కూడా ఎక్కువగానే ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

భారత్​లో కూడా నియో బ్యాంకింగ్ ట్రెండ్ ఇటీవలే ప్రారంభం అయింది. ఇవి ప్రస్తుతం వ్యాపార సంస్థలకు మాత్రమే ఎక్కువగా సేవలు అందిస్తున్నాయి. రేజర్ పే ఎక్స్, ఓపెన్ ఫినాన్షియల్ టెక్నాలజీ లాంటివి వీటికి మంచి ఉదాహరణలు. కొన్ని దేశాల్లో రిటైల్ కస్టమర్లకు కూడా ఇవి సేవలు అందిస్తున్నాయి.

భవిష్యత్..

నియో బ్యాంకింగ్ అనేది ఆర్థిక సేవలను పూర్తిగా మార్చివేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఇన్నోవేషన్ ఆధారిత సేవలే దీనికి కారణమని వారు చెబుతున్నారు. వీటికి సంప్రదాయ బ్యాంకింగ్​ను సమూలంగా మార్చే శక్తి ఉందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. చిన్న తరహా పరిశ్రమలకు సంప్రదాయ బ్యాంకుల కంటే ఇవి మెరుగ్గా సేవలు అందిస్తాయంటున్నారు.

ఇదీ చదవండి: ఆటో డెబిట్​కు 1వ తేదీ నుంచి కొత్త రూల్స్- ఇక అంత ఈజీ కాదు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.