ఎస్ బ్యాంక్ సంక్షోభం వేళ గుజరాత్ వడోదరా నగరపాలక (వీఎంసీ) అధికారులు చురుకుగా వ్యవహరించారు. వీఎంసీ అధీనంలోని వడోదరా స్మార్ట్ సిటీ అభివృద్ధి సంస్థకు చెందిన రూ.265 కోట్లు ఎస్ బ్యాంకు నుంచి రెండురోజుల క్రితమే విత్డ్రా చేశారు.
ఈ మొత్తం స్మార్ట్ సిటీ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం కేటాయించినట్లు వీఎంసీ డిప్యూటీ కమిషనర్ సుధీర్ పటేల్ తెలిపారు. ఎస్ బ్యాంకు సమస్యల్లో ఉన్న కారణంగానే ఈ నిర్ణయానికి వచ్చామన్నారు. ఆ డబ్బును బ్యాంక్ ఆఫ్ బరోడాలో వేశామన్నారు.
బ్యాంకులోనే జగన్నాథుడి సొమ్ము
ఎస్ బ్యాంకులో దేవుడి పేరిట రూ.545 కోట్లను జమ చేసింది పూరీ జగన్నాథ్ దేవాలయం. ఈ ధనానికి సంబంధించి భక్తులు, పూజారులు ఆందోళన చెందుతున్నారు.
ఎస్ బ్యాంకుపై ఆర్‌బీఐ మారటోరియం విధించడం.. నగదు ఉపసంహరణ పరిమితిని రూ.50,000 నిర్ణయించింది. ఫలితంగా కొంత ఆందోళన నెలకొందని ఆలయాధికారి బైనాయక్ దాస్మోహావ్ పాత్రా పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ఎస్ బ్యాంక్ సంక్షోభంపై ఎవరెవరు ఏమన్నారంటే..