ETV Bharat / business

ఎన్‌సీబీ.. బదిలీ చేసుకోవాలా? ఇవి తెలుసుకోండి..

author img

By

Published : Feb 11, 2022, 6:07 PM IST

Vehicle Insurance: వాహనానికి ఆర్థిక భద్రత కల్పించేది సమగ్ర మోటార్‌ బీమా పాలసీ. వాహనం ఏదైనా ప్రమాదానికి కారణమైనప్పుడు.. ఇతరులకు కలిగే నష్టానికీ పరిహారం అందిస్తుంది. వాహనానికీ (ఓన్‌ డ్యామేజీ), ఇతరులకూ నష్టం వాటిల్లినప్పుడు (థర్డ్‌ పార్టీ) ఈ సమగ్ర మోటార్‌ బీమా పాలసీ దానికి పరిహారాన్ని చెల్లిస్తుంది. ఈ పాలసీని పునరుద్ధరించుకునే సమయంలో ప్రీమియం భారం తగ్గించుకునేందుకు నో క్లెయిం బోనస్‌ (ఎన్‌సీబీ) ఉపయోగపడుతుంది. దీన్ని వాహనానికి కాకుండా.. దాన్ని సరిగ్గా నడిపిన యజమానికి బహుమానంగా ఇస్తారు. ఈ ఎన్‌సీబీని ఎలా బదిలీ చేసుకోవాలో తెలుసుకుందాం.

Vehicle Insurance
ఎన్‌సీబీ.. బదిలీ చేసుకున్నారా?

NCB tansfer: వాహనమేదైనా సరే.. రోడ్డు మీద తిరగాలంటే.. దానికి బీమా (కనీసం థర్డ్‌పార్టీ) ఉండాల్సిందే. ఈ పాలసీని ఏటా గడువులోపే పునరుద్ధరించుకోవాలి. ఎలాంటి క్లెయిం లేకపోతే.. ప్రీమియంలో రాయితీని అందిస్తాయి బీమా సంస్థలు. దీన్నే నో క్లెయిం బోనస్‌ పేరుతో పిలుస్తారు. ఇది కొన్ని శ్లాబులను బట్టి ఉంటుంది. మొదటి ఏడాది క్లెయిం లేకపోతే 20 శాతం వరకూ ఇది వర్తిస్తుంది. రెండు, మూడు, నాలుగు, అయిదో సంవత్సరాల్లోనూ ఎలాంటి క్లెయిములూ లేకపోతే.. వరుసగా 25%, 35%, 45%, 50శాతం వరకూ ఎన్‌సీబీ లభిస్తుంది. గరిష్ఠంగా దీన్ని 50శాతానికి పరిమితం చేశారు.

థర్ట్‌పార్టీకి వర్తించదు..

ఎన్‌సీబీ ఓన్‌ డ్యామేజీ (ఓడీ) ప్రీమియానికి మాత్రమే వర్తిస్తుంది. థర్ట్‌ పార్టీ ప్రీమియంపై కాదు. ఉదాహరణకు మొత్తం సమగ్ర బీమా పాలసీ రూ.3,000 అనుకుందాం. ఇందులో 20శాతం థర్డ్‌ పార్టీ ప్రీమియం (రూ.600) ఉందనుకుంటే.. మిగిలిన రూ.2,400 మొత్తంపైనే ఎన్‌సీబీ తగ్గింపు వర్తిస్తుంది.

యజమానికి బహుమానంగా...

వాహనానికి ఎలాంటి ప్రమాదం జరగకుండా నడిపిని యజమాని/డ్రైవర్‌కు బహుమతిగా ఈ ఎన్‌సీబీ లభిస్తుంది. కాబట్టి, వాహనాన్ని మార్చినప్పుడు మీ ఎన్‌సీబీని సులభంగా కొత్త వాహనానికి బదిలీ చేసుకోవచ్చు. చిన్న చిన్న నష్టాలకు క్లెయింలు చేసుకోకుండా ఉండటమూ ఎన్‌సీబీని పెంచుతుంది. ఏదైనా ప్రమాదం జరిగి, వాహనం మరమ్మతు చేయాల్సి వచ్చినప్పుడు వాస్తవంగా అయ్యే ఖర్చు.. నో క్లెయిం బోనస్‌ ప్రయోజనాన్ని బేరీజు వేసుకోవాలి. ఉదాహరణకు పాలసీ పునరుద్ధరణ సమయంలో రూ.6,000 ఎన్‌సీబీకి అర్హులు అనుకుందాం. ఇప్పుడు చిన్న మరమ్మతుకు రూ.3,000 ఖర్చు అవుతుంది. అప్పుడు మీ చేతి నుంచి రూ.3,000 చెల్లించడమే మంచిది. క్లెయిం చేస్తే రూ.3,000 నష్టపోతారు. బీమా క్లెయిం చేయాలా వద్దా అనేది ఈ లెక్కలు వేసుకున్నాకే నిర్ణయించుకోవాలి.

ప్రీమియం భారం తగ్గేలా...

ఎన్‌సీబీని కొత్త కారుకు బదిలీ చేయాలనుకుంటే కొన్ని ముఖ్యమైన విషయాలు గమనించాలి. మీరు పాత కారు యజమానిగా ఉన్నంత వరకూ ఈ ఎన్‌సీబీని కొత్త వాహనానికి బదిలీ చేయడం సాధ్యం కాదు. పాత కారును అమ్మినప్పుడు లేదా ఇతర కుటుంబ సభ్యుల పేరుమీదకు మార్చినప్పుడు మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. పాతకారు 8-10 ఏళ్ల పాతది అనుకుందాం.. వరుసగా అయిదేళ్లపాటు ఎలాంటి క్లెయిం చేయలేదు. అంటే మీరు 50శాతం ఎన్‌సీబీ పొందడానికి అర్హులు. ఇప్పుడు కొత్త కారుకు రూ.30,000 ప్రీమియం అనుకుందాం. ఇందులో రూ.5,000 థర్డ్‌ పార్టీ ప్రీమియం అనుకుంటే.. రూ.25,000పై 50శాతం రాయితీ లభిస్తుందన్నమాట. ముందే చెప్పినట్లు మీరు ఎన్‌సీబీ సర్టిఫికెట్‌ను తీసుకొని, దీనికి దరఖాస్తు చేసుకోవాలి.

ఏం చేయాలంటే...

ఎన్‌సీబీ బదిలీ చాలా సుభంగా చేసుకోవచ్చు. బీమా సంస్థ నుంచి ఆఫ్‌లైన్‌ పాలసీ తీసుకుంటే.. నేరుగా సంస్థను సంప్రదించి, ఎన్‌సీబీ బదిలీ కోసం అవసరమైన పత్రాలను సమర్పించాలి. బీమా సంస్థ మీ ఎన్‌సీబీ సర్టిఫికెట్‌ను అందిస్తుంది. కొత్త బీమా సంస్థకు ఆ సర్టిఫికెట్‌ను అందించాలి. అప్పుడు మీకు ఎన్‌సీబీ బదిలీ జరుగుతుంది. ఆన్‌లైన్‌లో కొంటే.. ఎన్‌సీబీ కోసం మునుపటి పాలసీ నెంబరు, బీమా సంస్థ పేరు కొత్త సంస్థకు తెలియజేయాలి. కొత్త బీమా సంస్థ మీకు ఎన్‌సీబీని బదిలీ చేస్తుంది. ఈ ఎన్‌సీబీ సర్టిఫికెట్‌ మూడేళ్లపాటు చెల్లుబాటు అవుతుంది.

అనుబంధ పాలసీగా..

క్లెయిం చేసినప్పటికీ ఎన్‌సీబీ వర్తించేలా సహాయం చేసేందుకు ఇప్పుడు బీమా సంస్థలు ఎన్‌సీబీ ప్రొటెక్షన్‌ను అనుబంధ పాలసీగా అందిస్తున్నాయి. వీటిని పరిశీలించవచ్చు. ఏడాదిలో ఎన్ని క్లెయింల వరకూ అనుమతించాలన్నది బీమా సంస్థలను బట్టి మారుతూ ఉంటుంది. అధిక శాతం సంస్థలు ఏడాదికి రెండు క్లెయింల వరకూ అనుమతిస్తున్నాయి.

-ఆదిత్య శర్మ, చీఫ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఆఫీసర్‌, బజాజ్‌ అలియాంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌

ఇదీ చదవండి: కొత్తగా పెళ్లయిందా? బీమా, లోన్ విషయంలో ఇలా చేస్తే లాభాలెన్నో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.