ETV Bharat / business

వందే భారత్ ఫేజ్​-2 బుకింగ్స్ ప్రారంభం

మే 16 నుంచి ప్రారంభం కానున్న వందే భారత్ రెండో విడత కార్యక్రమం ద్వారా 32 వేల మంది భారతీయులను స్వదేశానికి తీసుకురానున్నట్లు తెలిపారు విమానయాన శాఖ మంత్రి హర్​దీప్ సింగ్ పూరీ. 32 దేశాల నుంచి 149 విమానాల్లో భారతీయులను తీసుకురానున్నట్లు స్పష్టం చేశారు. వందే భారత్‌ ఫేజ్‌-2లో భాగంగా బుకింగ్స్‌ ఓపెన్‌ చేసినట్లు ఎయిరిండియా వెల్లడించింది.

vande bharat
వందే భారత్
author img

By

Published : May 14, 2020, 11:35 PM IST

లాక్‌డౌన్‌ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు చేపట్టిన వందే భారత్‌ మిషన్‌ రెండో విడతలో... 32 వేల మందిని తీసుకురానున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పూరీ తెలిపారు.

ఈ నెల 16 నుంచి 22 మధ్య అమెరికా, ఫ్రాన్స్‌, రష్యా, జర్మనీ, ఇటలీ సహా 32 దేశాల నుంచి 149 విమానాల్లో భారతీయులను తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. వందే భారత్ మిషన్‌ మొదటి విడతలో భాగంగా 14,800 మంది భారత్‌కు రావాల్సి ఉండగా... ఇప్పటికే 8,500 మంది మనదేశానికి చేరుకున్నారని పూరీ తెలిపారు. త్వరలోనే మిగిలిన వారు వస్తారని స్పష్టం చేశారు.

బుకింగ్స్​ ప్రారంభం..

మే 16వ తేదీ నుంచి రెండో దశలో 149 విమానాలను కేంద్రం నడపనుంది. ఈ నేపథ్యంలో ఆయా విమానాల్లో ప్రయాణించేందుకు టికెట్ల‌ బుకింగ్‌ను ఓపెన్‌ చేసింది ఎయిరిండియా. మొదటి దశలో 64 విమానాలను నడిపిన సంస్థ.. ఇప్పుడా సంఖ్యను దాదాపు రెట్టింపు చేసింది.

"అమెరికా, యూకే,ఆస్ట్రేలియా, ఫ్రాంక్‌ఫర్ట్‌, పారిస్‌, సింగపూర్‌, కెనడాలలోని ఎంపిక చేసిన ప్రాంతాల నుంచి విమాన రిజర్వేషన్లు ప్రారంభమయ్యాయి" అని ఎయిరిండియా వెల్లడించింది.

ఈ దేశాలే కాకుండా, దిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో, మాస్కో, ఫ్రాంక్‌ఫర్ట్‌, పారిస్‌, చికాగో, సింగపూర్‌, వాషింగ్టన్‌, రియాద్‌, లండన్‌, వాంకోవర్‌, మెల్‌బోర్న్‌, జెడ్డా, సిడ్నీ, టొరంటో, అబుదాబి, ఢాకా, బ్యాంకాక్‌, కౌలాలంపూర్‌, కాఠ్‌మాండు, రోమ్‌, మస్కట్‌, తిబ్లిసి, రోమ్‌లకు కూడా విమానాలు నడుపనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

మొదటి దశలో కేవలం దిల్లీలోనే ల్యాండ్‌ అయిన విమానాలు, రెండో దశలో దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లోనూ ల్యాండ్‌ కానున్నట్లు సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.