ETV Bharat / business

బడ్జెట్ 2022-23: నిర్మల 'పద్దు' ఆరోగ్య రంగానికి బూస్టర్​ అవుతుందా? - union budget news today

Union budget 2022-23: రెండేళ్లుగా పట్టిపీడిస్తున్న కొవిడ్ మహమ్మారి దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలోని డొల్లతనాన్ని బయటపెట్టింది. ఆ రంగానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యాన్ని నొక్కిజెప్పింది. ఈ నేపథ్యంలో వచ్చే ఆర్థిక పద్దులో ఆరోగ్యరంగంలో పరిశోధనలు, నవకల్పనలకు పెట్టుబడులు తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్య రంగానికి బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యం ఇచ్చి ప్రజారోగ్య వ్యవస్థకు నిర్మలమ్మ బూస్టర్‌ డోసు ఇవ్వాలని అభిప్రాయపడుతున్నారు.

Union budget 2022
''పద్దు' ఆరోగ్య వ్యవస్థకు బూస్టర్​ డోసులా ఉండాలి'
author img

By

Published : Jan 26, 2022, 3:10 PM IST

Union budget 2022-23: దేశ ఆరోగ్య సంరక్షణ రంగంలోని డొల్లతనాన్ని కొవిడ్‌ మహమ్మారి బహిర్గతం చేసింది. ముఖ్యంగా కరోనా రెండో దశలో ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొరత, ఐసీయూ పడకల కొరత.. ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు మెరుగుపడాల్సిన అవసరాన్ని తెలియజేశాయి. గతేడాది బడ్జెట్‌లో వ్యాక్సిన్లకు కేటాయింపులు జరిపినప్పటికీ.. మొత్తంగా ఆరోగ్య రంగానికి పెంచింది అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో ఈసారైనా ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెంచాలని ఫార్మా పరిశ్రమ, ఆరోగ్య రంగ నిపుణులు కోరుతున్నారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వైద్యశాస్త్రంలో పరిశోధనలు, నవకల్పనలకు పెట్టుబడులు తీసుకువచ్చేలా బడ్జెట్ ప్రసంగం ఉండాలని ఫిక్కీ హెల్త్‌ సర్వీసెస్‌ కమిటీ ఛైర్మన్ డాక్టర్ అలోక్ రాయ్ సూచించారు.

బడ్జెట్​పై నిపుణుల సూచనలు..

  • ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేలా నిధులు కేటాయించాలి. ఆరోగ్య రంగానికి బడ్జెట్‌లో జీడీపీలో కనీసం రెండున్నర శాతం కేటాయింపులు జరపాలి.
  • పన్ను ప్రయోజనాలు, ట్యాక్స్ హాలిడేల రూపంలో లేదా హెల్త్‌కేర్ ఇన్నోవేషన్ ఫండ్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రజారోగ్యవ్యవస్థకు ప్రోత్సాహం అందించాలి.
  • టైర్‌ 2, టైర్‌3 నగరాల్లో సబ్సిడీ రుణాల ద్వారా ఆరోగ్య సంరక్షణ రంగానికి ఊతమివ్వాలి.
  • ఆరోగ్య రంగానికి ప్రస్తుతం బడ్జెట్‌లో జీడీపీలో 1.8 శాతం మాత్రమే కేటాయింపులు జరుపుతున్నారు. ఆ మొత్తాన్ని 2.5 నుంచి 3 శాతానికి పెంచాలి
  • పరిశోధన, అభివృద్ధి విభాగానికి బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు ఉండాలి.
  • కొన్ని ఔషధాలపై ఇప్పుడిస్తున్న కస్టమ్స్‌ డ్యూటీ రాయితీని కొనసాగించాలి.
  • కొన్ని అరుదైన వ్యాధులను నయం చేసేందుకు వాడే ఔషధాలకు దిగుమతి సుంకాల నుంచి మినహాయింపు ఇవ్వాలి.
  • ఫార్మా రంగంలో సులభతర వాణిజ్య విధానాలను అవలంబించాలి. అప్పుడే రోగుల అవసరాలను తీర్చే స్థాయిలో భారత ఫార్మా రంగం సన్నద్ధం కాగలదు.
  • టెలీమెడిసిన్‌కు సంబంధించిన మౌలిక సదుపాయాలను వృద్ధి చేయాల్సిన అవసరాన్ని కొవిడ్‌ మహమ్మారి తెలియజెప్పింది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో సైతం డయాగ్నోస్టిక్‌ సెంటర్లు, ఆక్సిజన్‌ పడకలు, ఐసీయూలు, ఆక్సిజన్‌ ప్లాంట్లు కలిగిన ఆస్పత్రులు నెలకొల్పాల్సిన అవసరం ఉంది.

వైద్య పరికరాల తయారీపై..

  • వైద్యపరికరాల తయారీ రంగానికి దేశంలో మంచి భవిష్యత్తు ఉందంటున్నారు నిపుణులు. ప్రస్తుతం మెడికల్ డివైసెస్ రంగంలో ప్రపంచంలోని తొలి 20 మార్కెట్లలో భారత్‌ ఉందని చెబుతున్నారు. 2025 నాటికల్లా ఈ రంగం మార్కెట్ విలువ 50 బిలియన్ డాలర్లకు చేరే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం భారత్ దాదాపు 80శాతం వైద్యపరికరాలను దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో వైద్య పరికరాలను దేశంలోనే తయారయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
  • ఐటీ పార్కుల తరహాలో మెడికల్ డివైస్ పార్కులు అభివృద్ధి చేయాలి.
  • ఆరోగ్య రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వెల్లువెత్తేలా FDI నిబంధనలను సరళీకరించాలి.
  • కొవిడ్ మహమ్మారి ఎప్పటికప్పుడు రూపుమార్చుకుంటూ సవాళ్లు విసురుతున్న నేపథ్యంలో కొవిడ్‌పై పరిశోధనకు గానూ ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి.
  • గతేడాది కొవిడ్ వ్యాక్సినేషన్ కోసం రూ.35వేల కోట్లు కేటాయింపులు జరపగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో పిల్లలతో పాటు బూస్టర్ డోసు పంపిణీ కోసం కేటాయింపులు మరింత పెంచాల్సిన అవసరం ఉంది.

కొవిడ్ మహమ్మారి సవాళ్ల నేపథ్యంలో వచ్చే బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి పెద్దపీట వేయాల్సిన అవసరముందని అసోచామ్ సర్వేలోనూ వెల్లడైంది. 2022-23 బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి నిర్మలమ్మ అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిందిగా 47 శాతం మంది అభిప్రాయపడ్డారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: బడ్జెట్​పై సామాన్యుల భారీ ఆశలు- పన్ను రేట్లు తగ్గుతాయా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.