ETV Bharat / business

Twitter: ఎట్టకేలకు ఆ అధికారి నియామకం

author img

By

Published : Jul 11, 2021, 10:34 AM IST

Updated : Jul 11, 2021, 11:27 AM IST

చాలా రోజుల జాప్యం అనంతరం భారత్​లో ఫిర్యాదుల అధికారిని నియమించింది ట్విట్టర్​(Twitter). ఆర్​జీఓగా వినయ్​ ప్రకాశ్​ను నియమించినట్లు వెల్లడించింది.

Twitter
ట్విట్టర్

ఎట్టకేలకు భారత్​లో రెసిడెంట్​ గ్రీవెన్స్​ అధికారి(Resident Grievance Officer)ని నియమించింది సామాజిక మాధ్యమం ట్విట్టర్​(Twitter). ఆర్​జీఓగా వినయ్​ ప్రకాశ్​ను నియమించినట్లు సంస్థ వెబ్​సైట్​లో తెలిపింది. అందులోని ఈమెయిల్​ ఐడీకి వినియోగదారులు తమ ఫిర్యాదులను పంపించవచ్చని పేర్కొంది.

కొన్నాళ్లుగా నూతన ఐటీ నిబంధనల(new IT rules) విషయమై కేంద్ర ప్రభుత్వం, ట్విట్టర్​ మధ్య తీవ్ర వివాదం నడుస్తోంది. ఐటీ నిబంధనలు పాటించడంలో ట్విట్టర్‌ విఫలమైందని ఇటీవల దిల్లీ హైకోర్టులో కేంద్రం అఫిడవిట్‌ దాఖలు చేసింది. ట్విట్టర్‌ తీరుపై దిల్లీ హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిర్యాదు అధికారుల నియామకంలో జాప్యం తగదని హెచ్చరించిన కోర్టు.. ఇంకెంత కాలం పడుతుందని ప్రశ్నించింది. అందుకు ఇటీవలే 8 వారాల గడువు కోరిన ట్విట్టర్​.. ఆ లోపే ఆర్​జీఓను నియమించింది.

నూతన ఐటీ చట్టం ప్రకారం 50లక్షల యూజర్లు దాటిన సామాజిక మాధ్యామాలు తప్పనిసరిగా ముగ్గురు అధికారులను (ఆర్​జీఓ, చీఫ్ కంప్లైయన్స్​ ఆఫీసర్, నోడల్ అధికారి) నియమించుకోవాలి. వారందరూ భారత్​లో నివసిస్తూ ఉండాలి. కాగా, 1.75 కోట్ల మేర వినియోగదారులున్న ట్విట్టర్​ నిబంధనలు పాటించని కారణంగా గత నెల మధ్యవర్తిత్వ హోదాను కోల్పోయింది.

ఇవీ చూడండి:

ట్విట్టర్‌కు కొత్త మంత్రి వార్నింగ్‌- రూల్స్ తప్పితే...

ఇండియా మ్యాప్​తో మరోసారి ట్విట్టర్​ ఆటలు!

Last Updated : Jul 11, 2021, 11:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.