Twitter Ceo Salary In Indian Rupees: ట్విట్టర్‌కు కొత్త ముఖ్య కార్యనిర్వహణాధికారిగా పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు. సీఈఓ హోదాలో పరాగ్ ఏడాదికి మిలియన్ డాలర్లు (రూ.7 కోట్లు 40 లక్షలు) మేర వేతనం అందుకోకున్నారు. ప్రోత్సాహకాలు, బోనస్‌లు ఉండనున్నాయి.
ట్విట్టర్ సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు జాక్ డోర్సీ ప్రకటించగానే ఆ స్థానంలో పరాగ్‌ను తదుపరి సీఈఓగా నియమించింది సంస్థ. 2011లో ట్విట్టర్లో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగంలో చేరారు పరాగ్. 2017 నుంచి ట్విట్టర్‌కు చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా పని చేశారు. అనంతరం సంస్థ సాంకేతిక వ్యూహాత్మక బృందానికి బాధ్యత వహించారు పరాగ్.
ట్విటర్‌లో చేరినప్పటి నుంచీ అన్నిటా కీలకంగా మారారు. ట్విట్టర్ యాడ్స్ సిస్టమ్‌లను అభివృద్ధి చేసిన టీంకు అతను నాయకత్వం వహించారు. అలాగే హోమ్ టైమ్‌లైన్‌ను మరింతగా వృద్ధి చేశారు. ఈ చర్యతో ట్విట్టర్‌కు యూజర్ల సంఖ్య అమాంతం పెరిగింది.
'పరాగ్ అగర్వాల్ సుమారు ఒక మిలియన్ డాలర్లను జీతంగా పొందుతారు. వార్షిక వేతనం కంటే కూడా 150 శాతం మేర బోనస్‌కు లభించనుంది' అని అమెరికాలోని నియంత్రణా సంస్థలకు ఇచ్చిన సమాచారంలో ట్విట్టర్ పేర్కొంది. అంతేగాకుండా ఒక మిలియన్ డాలర్ల వార్షిక వేతనంతో పాటు 12.5 మిలియన్ డాలర్లు విలువ చేసే రెస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్లు కూడా అగర్వాల్ పొందనున్నారు. వీటితో పాటు ట్విటర్ ఉద్యోగులకు లభించే ఇతర అన్ని ప్రయోజనాలూ అగర్వాల్‌కు కూడా లభిస్తాయి.
ఇవీ చూడండి:
ప్రపంచ దిగ్గజ కంపెనీల్లో అగ్రాసనం భారతీయులదే- కారణమిదే..
ట్విట్టర్ సీఈఓగా తప్పుకున్న డోర్సీ.. తదుపరి పగ్గాలు భారతీయుడికే