టెలికాం సంస్థలు క్లెయిమ్, రీఫండ్ చేయని వినియోగదారుల డబ్బును (అదనపు ఛార్జీలు, సెక్యూరిటీ డిపాజిట్) ఏం చేయాలన్న దానిపై ట్రాయ్ స్పష్టతనిచ్చింది. నిర్ణీత వ్యవధి తరువాత ఈ డబ్బును వినియోగదారుల 'విద్య, రక్షణ నిధి'కి జమచేయాలని ఆదేశించింది.
"వినియోగదారులకు తిరిగి చెల్లించలేని డబ్బును ఏం చేయాలన్నదానిపై... టెలికాం సంస్థలకు ఉన్న సందిగ్ధాన్ని తొలగించాల్సిన అవసరాన్ని గుర్తించాం. అందుకే క్లెయిమ్ లేదా రీఫండ్ చేయని డబ్బును జమ చేయడానికి వీలుగా సంబంధిత నిబంధనల్లో సవరణలు చేయాలని నిర్ణయించాం."- టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)
బిల్లింగ్ ఆడిట్లో వెల్లడైన అదనపు ఛార్జీలను వినియోగదారులకు తిరిగి చెల్లించాలి. నిబంధనల మేరకు నిర్ణీత (12 నెలలు) కాలవ్యవధిలో ఈ డబ్బును వినియోగదారులకు రీఫండ్ చేయకపోతే... ఆ మొత్తాన్ని వినియోగదారుల విద్య, రక్షణ నిధికి జమ చేయాలి.
అసమానతలున్నాయ్...
టెలికాం సంస్థలు జమ చేసే మొత్తంలో అసమానతలు ఉన్నాయని ట్రాయ్ తెలిపింది.
"టెలికాం సర్వీస్ ప్రొవైడర్లలో కొన్ని.. ఆడిట్లో వెల్లడైన అదనపు ఛార్జీలను మాత్రమే జమ చేస్తున్నారు. మరికొన్ని సర్వీసు ప్రొవైడర్ల సెక్యూరిటీ డిపాజిట్లు, ప్లాన్ ఛార్జీల లాంటి క్లెయిమ్ చేయని డబ్బును జమ చేస్తున్నారు. వినియోగదారులను సరిగ్గా గుర్తించలేని కారణంగా డబ్బును రీఫండ్ చేయలేకపోతున్నాయి. అందుకే సంబంధిత నిబంధనల్లో సవరణలు చేయాలని నిర్ణయించాం." - ట్రాయ్
ఇదీ చూడండి: వొడాఫోన్-ఐడియా షేర్లు 39శాతం పతనం