ఎస్ఎంఎస్పై ఎలాంటి ఛార్జీలను విధించకూడదని భారత టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ-ట్రాయ్ నిర్ణయించింది. ప్రస్తుతం రోజుకు 100 సందేశాలకు మించి పంపిన ప్రతి ఎస్ఎంఎస్పై 50పైసలను వసూలు చేస్తోంది. అభ్యంతరకర సందేశాలకు అడ్డుకట్ట వేసేందుకు ఛార్జీల విధానాన్ని 2012 నవంబర్లో ప్రవేశపెట్టింది ట్రాయ్.
"టెలికాం కమర్షియల్ కమ్యూనికేషన్స్ కస్టమర్ ప్రిఫరెన్స్ రెగ్యులేషన్స్ (టీసీసీసీపీఆర్)-2018 ప్రవేశంతో ఎస్ఎంఎస్లపై ఛార్జీల అవసరం లేకుండా పోయింది. టెలీకమ్యూనికేషన్ టారిఫ్ ముసాయిదాలో 54వ సవరణలో పేర్కొన్న 50 పైసల ఛార్జీలను తొలగించాలని ప్రతిపాదనలు చేశాం. "
-ట్రాయ్
ఈ ప్రతిపాదనపై టెలికాం సంస్థలు తమ అభిప్రాయాలను తెలియజేసేందుకు మార్చి 3ను తుది గడువుగా నిర్ణయించింది ట్రాయ్.