అమెరికా దిగుమతులపై విధిస్తున్న 75 బిలియన్ డాలర్ల శిక్షాత్మక సుంకాలను తగ్గించనున్నట్లు చైనా పేర్కొంది. ఫిబ్రవరి 14 నుంచి ఈ సుంకాల్లో సగం తగ్గించనున్నట్లు స్పష్టం చేసింది. యూఎస్- చైనా వాణిజ్య ఒప్పందం జరిగిన నెల రోజుల తరువాత ఆ దేశం ఈ ప్రకటన చేసింది.
సెప్టెంబర్లో 1,600కి పైగా వస్తువులపై విధించిన 5 శాతం, 10 శాతం సుంకాలకు... ఈ తగ్గింపు వర్తిస్తుందని స్టేట్ కౌన్సిల్ టారిఫ్ కమిషన్ పేర్కొంది.
ఇదీ చూడండి: మార్చి 29న భారత్‌లో ప్రవేశించనున్న డిస్నీ+