ETV Bharat / business

చైనా ఒప్పుకుంటేనే టిక్‌టాక్‌ విక్రయం? - TikTok’s sale in U.S. may need China’s approval

టిక్​టాక్​ అమ్మకాన్ని అడ్డుకునేందుకు చైనా ప్రయత్నాలు చేస్తోంది. దీనికోసం ప్రత్యేక నిబంధనలను రూపొందించినట్లు చైనాకు చెందిన ఓ ప్రముఖ ప్రొఫెసర్​ తెలిపారు. దీని ప్రకారం టిక్​‌టాక్‌ను విక్రయించాలంటే చైనా ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.

TikTok Sale Many Need Beijings permission
చైనా ఒప్పుకుంటేనే టిక్‌టాక్‌ విక్రయం?
author img

By

Published : Aug 31, 2020, 1:03 PM IST

వినియోగదారుల భద్రతను కాపాడే విషయంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న టిక్‌టాక్‌ విక్రయాన్ని అడ్డుకునేందుకు చైనా ఎత్తుగడలు వేస్తోంది. తద్వారా టిక్‌టాక్‌ అమెరికా కార్యకలాపాల్ని విక్రయించాలన్న ట్రంప్‌ డిమాండ్‌కు చెక్‌ పెట్టేందుకు యత్నిస్తోంది. అందుకోసం ప్రత్యేకంగా నిబంధనలు రూపొందించిన్నట్లు చైనాకు చెందిన ఓ ప్రముఖ ప్రొఫెసర్‌ తెలిపారు. ఈ మేరకు అక్కడి అధికారిక మీడియా సంస్థ జిన్హువా ఓ కథనాన్ని ప్రచురించింది.

టిక్‌టాక్‌ అమెరికా కార్యకలాపాల్ని విక్రయించాలని ట్రంప్‌ దాని మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌ను ఆదేశించిన విషయం తెలిసిందే. లేదంటే నిషేధం విధిస్తామని హెచ్చరించారు. దీంతో ఒరాకిల్‌, మైక్రోసాఫ్ట్‌, వాల్‌మార్ట్‌ వంటి దిగ్గజ సంస్థలు టిక్‌టాక్‌ కొనుగోలుకు ఆసక్తిగా ఉన్నాయి. ఆ మేరకు చర్చలు కూడా ప్రారంభించాయి. తక్కువ కాలంలో అత్యంత ఆదరణ పొందిన ఈ వీడియో షేరింగ్‌ యాప్‌ ద్వారా వస్తున్న ఆదాయాన్ని పొగొట్టుకునేందుకు చైనా ఏమాత్రం ఇష్టపడడం లేదు. పైగా పశ్చిమ దేశాలతో నెలకొన్న రాజకీయపరమైన విభేదాలనూ దృష్టిలో ఉంచుకొని దీని విక్రయాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని భావిస్తోంది.

ఈ క్రమంలో చైనా నుంచి ఎగుమతి లేదా విక్రయించేందుకు నిషేధించిన సాంకేతికతల జాబితాను డ్రాగన్‌ సవరించింది. ఇలా చేయడం గత 12 ఏళ్లలో ఇదే తొలిసారి. ఈ సవరణలు టిక్‌టాక్‌కు కూడా వర్తించే అవకాశం ఉందని బీజింగ్‌లోని ఓ ప్రముఖ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్‌ క్వి ఫ్యాన్‌ తెలిపారు. మొత్తం 23 అంశాల్ని తాజాగా నిషేధిత జాబితాలో చేర్చినట్లు సమాచారం. వినియోగదారుల ఆసక్తికి అనుగుణంగా అందించే సేవలకు సంబంధించిన కోడింగ్‌ లేదా ఆల్గారిథమ్‌ కూడా దీనిలో ఉన్నట్లు సమాచారం.

వినియోగదారులకు తెరలకు కట్టిపడేస్తున్న టిక్‌టాక్‌లోని ప్రత్యేక ఫీచర్‌ ‘ఫర్‌ యూ’ పేజ్‌. దీంట్లో మనం తరచూ చూస్తున్న వీడియోలను బట్టి మన ఆసక్తిని పసిగడుతుంది. అందుకనుగుణంగానే తదుపరి వీడియోలను మన ముందుంచుతుంది. ఈ ప్రక్రియకు సంబంధించిన కోడింగ్‌ లేదా ఆల్గారిథన్‌ను అందించే సాంకేతికతపైనా తాజాగా చైనా ఆంక్షలు విధించినట్లు సమాచారం. చైనా తాజా చర్యలపై స్పందించిన బైట్‌డ్యాన్స్‌.. ప్రభుత్వ నిబంధనలకు లోబడే నడుచుకుంటామని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌ కార్యకలాపాల్ని విక్రయించే యోచనను బైట్‌డ్యాన్స్‌ సమీక్షించుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఒకవేళ నిషేధిత జాబితాలోని సాంకేతికతను విక్రయించాలంటే బీజింగ్‌ అనుమతి తప్పనిసరి. అందుకుకావాల్సిన ప్రక్రియను పూర్తి చేయడానికి నెల రోజులు గడువుగా విధించారు. ఈ పరిణామాల నేపథ్యంలో టిక్‌టాక్‌ను విక్రయించాలన్నా చైనా ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అనుమతుల సమయంలో వివిధ కారణాలు చూపి విక్రయాన్ని అడ్డుకొనే అవకాశమూ లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.