ETV Bharat / business

పవర్ 'బుల్​'​​ బ్యాంక్​తో ఛార్జింగ్​ కష్టాలకు చెక్​ - మంచి పవర్​ బ్యాంకుల వివరాలు

మనం పవర్ బ్యాంక్‌ను కొనుగోలు చేసినప్పుడు దానిని ఛార్జ్​ చేసేందుకు కేబుల్‌, ప్లగ్​ ఉంటాయి అది సహజమే. మరి పవర్ బ్యాంక్​లోనే ఛార్జింగ్​ తక్కువగా ఉన్నప్పుడు దాన్ని ఛార్జ్​ చేసేందుకు మనకు మరో పవర్ బ్రిక్​ లేదా ఛార్జర్ అందుబాటులో ఉండకపోతే? ఇంకేముంది పవర్ బ్యాంక్‌ను ఛార్జ్ చేసేందుకు అదనపు ఛార్జర్​ను కొనుగోలు చేయాల్సిందే. అయితే 'నిఫ్టీ పవర్ బ్యాంక్'ను ఛార్జ్ చేయడానికి ప్రత్యేక ఛార్జర్​, సాకెట్​ అవసరం లేదంటోంది దీనిని రూపొందించిన 'బుల్' అనే సంస్థ.

bull power bank
బుల్​ పవర్ ​ బ్యాంక్​
author img

By

Published : Apr 12, 2021, 12:15 PM IST

Updated : Apr 12, 2021, 12:56 PM IST

పవర్​ బ్యాంక్​కు ఛార్జ్​ చేయడమంటే మనలో చాలామందికి పెద్ద పనిగా అనిపిస్తుంది. దాని కోసం ప్రత్యేకంగా ఛార్జర్​ను తీసుకెళ్లటంపై అసౌకర్యంగా భావిస్తాం. అలాంటి ఇబ్బందులేవీ లేకుండా, ప్రత్యేక ఛార్జర్​, సాకెట్​ అవసరం లేని పవర్​ బ్యాంకును అందుబాటులోకి తీసుకొచ్చింది బుల్​ అనే సంస్థ. ఈ పవర్​ బ్యాంక్​ చాలా సౌకర్యంగా ఉంటుందని చెబుతోంది.

ఇన్​బిల్ట్​గా..

ఈ పవర్ బ్యాంక్​తో ఏదేనీ డివైజ్​ను ఛార్జ్ చేసేందుకు అంతర్గతంగా కేబుల్ ఉంటుందని చెబుతోంది. దీని‌తో పాటు.. పవర్​ బ్యాంక్​ ఛార్జింగ్​కు పవర్​ బ్రిక్​ సైతం ఇన్​బిల్ట్​గా ఉండటమే దీని ప్రత్యేకత. దీని ఛార్జింగ్​కు చేయాల్సిందల్లా ప్లగ్‌ను సాకెట్‌కు కనెక్ట్ చేయడమేనని కంపెనీ తెలిపింది. ఈ పవర్ బ్యాంక్‌ డిజైన్​కు పోర్టులేమీ ఉండవు. అంతేగాక అంతర్గత ఛార్జింగ్ కేబుల్ ఉన్నందున అవుట్​పుట్​ పోర్ట్ అవసరం లేదు.

పవర్ బ్యాంక్‌లో డిఫాల్ట్​గా ఇచ్చిన ఛార్జర్‌తో ప్రయాణాలు చేసేటప్పుడు ఛార్జింగ్ కేబుల్, వాల్ అడాప్టర్‌ను ప్రత్యేకంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. ఈ డిఫాల్ట్​ ఛార్జర్ మీ ఫోన్, పవర్ బ్యాంక్‌ను ఏకకాలంలో ఛార్జ్ చేస్తుంది. ఇక 'బుల్' పవర్ బ్యాంక్​లో ఉన్న మరో ఫీచర్​ 'కేబుల్ విండర్'. ఇది కేబుల్​ను పరిమిత స్థానంలో ఉంచేందుకు సహకరిస్తుంది. దీనితో యూజర్లు తమకు అవసరమైన పొడవును ఉపయోగించుకోగలరు.

ఇక దీనికి ఓ వైపు పవర్ బటన్ సహా.. ఛార్జింగ్​ లెవెల్స్​ని చూపించేందుకు నాలుగు ఎల్‌ఈడీలు ఉన్నాయి. 10000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉన్న ఈ పవర్ బ్యాంక్ ధర.. సుమారు 1800 రూపాయలు. యూఎస్​బీ-సీ టైప్​ కేబుల్, మైక్రో యూఎస్​బీ కేబుల్ రెండు రకాల్లో లభ్యమవుతోంది.

ఇవీ చదవండి: చిప్‌ల కొరతతో.. ప్రపంచం సతమతం

మీ స్మార్ట్​ఫోన్​కు బీమా చేయించారా?

Last Updated : Apr 12, 2021, 12:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.