ETV Bharat / business

క్రిప్టో సంబంధాలపై పునరాలోచన! - క్రిప్టో కరెన్సీపై ఆర్​బీఐ సూచనలు

ప్రస్తుతం అంతర్జాతీయంగా వ్యాపార రంగంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు క్రిప్టోకరెన్సీ. భారత్​ మాత్రం కొంత కాలంగా దీనిపై నిషేధం విధించే దిశగా కసరత్తు చేస్తోంది. అయితే ఈ విషయంపై ఆర్​బీఐ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజీలు, ట్రేడర్లతో సంబంధాలను కొనసాగించే విషయంపై పునరాలోచన చేయాల్సిందిగా ఆర్​బీఐ ఇతర బ్యాంకులకు సూచించినట్లు సమాచారం.

cryptocurrency
క్రిప్టో సంబంధాలపై పునరాలోచన
author img

By

Published : May 14, 2021, 10:29 AM IST

క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజీలు, ట్రేడర్లతో సంబంధాలు కొనసాగించే విషయంలో పునరాలోచన చేయాలని బ్యాంకులకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) సూచన చేసినట్లు తెలుస్తోంది. క్రిప్టోకరెన్సీలపై నిషేధం విధించే దిశగా భారత్‌ చట్టాలు రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో ఇలాంటి మార్గదర్శకాలు ఆర్‌బీఐ నుంచి బ్యాంకులకు అనధికారికంగా వచ్చాయని సమాచారం. క్రిప్టోకరెన్సీ పరిశ్రమతో బ్యాంకులు కలిసి పనిచేయొచ్చని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ.. క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీలు, ట్రేడర్లతో సంబంధాలు రద్దు చేసుకోవాల్సిందిగా బ్యాంకులకు ఆర్‌బీఐ అనధికారికంగా చెప్పినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

ఈ విషయమై ఆర్‌బీఐ నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు. ఐసీఐసీఐ బ్యాంక్‌ ఇప్పటికే క్రిప్టోకరెన్సీ ఆధారిత చెల్లింపు లావాదేవీలు ఆపేసేందుకు నిర్ణయించినట్లు తెలుస్తున్నప్పటికీ.. ఈ విషయంపై ఐసీఐసీఐ బ్యాంకు నుంచి కూడా ఎలాంటి స్పందన రాలేదు. యాక్సిస్‌ బ్యాంక్, కోటక్‌ మహీంద్రా బ్యాంకులు కూడా క్రిప్టోకరెన్సీ సంబంధిత లావాదేవీలను పరిమితం చేసుకునే దిశగా యోచన చేస్తున్నాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

ఇదీ చూడండి: మస్క్ యూటర్న్​- బిట్​కాయిన్​ 17% పతనం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.