ETV Bharat / business

'మౌలిక రంగ ఉద్దీపనలు ఆశాజనకమేమీ కాదు'

author img

By

Published : Jan 14, 2020, 9:03 PM IST

భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన మందగమనంలో ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉద్దీపన చర్యల పేరిట 102.51 ట్రిలియన్ల పెట్టుబడులను మౌలిక రంగంలో పెట్టనున్నట్లు ప్రకటించింది. మందగమనంలోని ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడానికి చాలా దేశాలు అనుసరించే వ్యూహాన్నే మోదీ ప్రభుత్వం పాటించింది. అయితే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి మౌలిక రంగంలో పెట్టుబడులు పెట్టడం సరైన మార్గమేనా? మౌలిక రంగంపై కేంద్ర ప్రభుత్వం ఇదివరకు చేసిన వ్యయాలు సత్ఫలితాలనిచ్చాయా? ఈ రంగంలో పెట్టుబడులను తగ్గించడం ద్వారా తలెత్తే పరిణామాలేంటీ అన్న విషయాలపై ప్రముఖ ఆర్థికవేత్త రేణు కోహ్లీ సమగ్ర విశ్లేషణ.

the national infrastructure pipeline stimulus- don't be too optimistic
'మౌలిక రంగ ఉద్దీపనలు ఆశాజనకమేమీ కాదు'

ఒక త్రైమాసికం నుంచి మరో త్రైమాసికానికి వృద్ధి రేటు క్రమక్రమంగా దిగజారుతున్న తరుణంలో 2019 డిసెంబర్​ 31న కేంద్ర ప్రభుత్వం ఉద్దీపన చర్యల నిమిత్తం కీలక ప్రకటన చేసింది. వచ్చే ఐదేళ్లలో మౌలిక రంగంలో 102.51 ట్రిలియన్ల పెట్టుబడులను పెట్టనున్నట్లు వెల్లడించింది. మార్చి 2020కి ముందు మూడు ఆర్థిక సంవత్సరాలలో జీడీపీ వృద్ధి తగ్గుతూ వస్తున్నందున ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. 2016-17లో 8.2 శాతంగా ఉన్న వాస్తవ వృద్ధి రేటు క్రమక్రమంగా పడిపోయింది. 2017-18 లో 7.2 శాతం, 2018-19 లో 6.8 శాతానికి దిగజారింది. కేంద్రం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధిలో 1.8 శాతం కోత పడింది. కేవలం 5 శాతంగానే నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది.

ఈ పరిస్థితుల్లో ప్రభుత్వంపై విపరీతమైన ఒత్తిడి నెలకొని ఉందనడంలో సందేహం లేదు. ఆర్థిక మందగమనంపై పోరాడటానికి ప్రభుత్వం మౌలిక రంగంపై దృష్టిసారించింది. రోడ్లు, విద్యుత్, ఇళ్ల నిర్మాణం, నీటి పారుదల వంటి రంగాల్లో పెట్టుబడులు పెడుతోంది. అయితే 2025 నాటికి భారత్​ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతేడాది ప్రకటించిన ఈ లక్ష్యాన్ని అందుకోవడానికి ఈ చర్యలు సరిపోవు. మౌలిక సదుపాయాల కల్పన ద్వారా పెట్టుబడులు, వృద్ధి, ఉద్యోగాలు పెరుగుతాయా అన్నది ప్రశ్నార్థకం.

మౌలిక రంగమే వేగు చుక్క

ఆర్థిక వ్యవస్థ కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజా మౌలిక సదుపాయల్లో పెట్టుబడులు పెట్టడం అన్నది చాలా దేశాల్లో సాధారణమైన విషయం. ఉదహరణకు అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం కారణంగా ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడి దక్షిణ కొరియా గతేడాది కోలుకోలేని నష్టం చవిచూసింది. తద్వారా ఆర్థిక వ్యవస్థ గాడి తప్పి మందగమనంలో పడిపోయింది. ఈ నేపథ్యంలో ఉద్యోగ కల్పన సహా ప్రైవేట్ రంగానికి ఊతమిచ్చేందుకు ఆ దేశ అధ్యక్షుడు మూన్ జే ఇన్ ప్రజా మౌలిక సదుపాయాల కల్పనలో 51 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టనున్నట్లు ప్రకటించారు. అటువంటి ప్రభుత్వ పెట్టుబడులు కొత్త డిమాండ్ అవకాశాలను పెంచి, ప్రైవేట్ సంస్థలను ఆకర్షిస్తాయనడంలో సంశయం లేదు. కీనేసియన్ ఆర్థిక సిద్ధాంతం ప్రకారం ఆర్థిక కార్యకలాపాలకు నూతనోత్తేజం తేవడం సహా మొత్తం డిమాండ్​ని పెంచడానికి ఈ పెట్టుబడులు ఉపకరిస్తాయి.

భారత్​ దృక్పథం ప్రశ్నార్థకం

అయితే వృద్ధి 11 ఏళ్ల కనిష్ఠానికి పడిపోవడం సహా భవిష్యత్ దృక్పథం ప్రశ్నార్థకంగా ఉన్న పరిస్థితుల్లో భారత్ తన మౌలిక రంగ పెట్టుబడులలో ఉన్న లోపాలను గుర్తించాల్సి ఉంటుంది. వృద్ధి రేటు అత్యంత కనిష్ఠ స్థాయికి దిగజారిందా? లేదంటే మరింత పతనమయ్యే పరిణామాలు ఉన్నాయా అన్న ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు లేవు.

వచ్చే ఐదేళ్లలో మౌలిక రంగాల్లో పెట్టుబడులను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మౌలిక రంగంలో ఉన్న రూ.6.2 ట్రిలియన్ల పెట్టుబడులను వచ్చే ఏడాది రూ.19.5 మిలియన్లకు పెంచాలని నిర్ణయం తీసుకుంది. 2021-22లో రూ.19 మిలియన్లు, ఆ తర్వాత 2024-25 నాటికి వరుసగా మూడేళ్లలో రూ.13.5, రూ.12.5, రూ.11 ట్రిలియన్లను పెట్టుబడులుగా పెట్టడానికి ప్రణాళికలు రచించింది.

ఇందులో 80 శాతాన్ని రోడ్లు, రైల్వే, విద్యుత్, నీటి పారుదల, గృహ నిర్మాణం వంటి రంగాల్లోనే ఖర్చు చేయనుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 78 శాతం రిస్క్​ని సమానంగా భరించనుండగా ప్రైవేటు భాగస్వాములు 22 శాతం నష్టాన్ని భరిస్తాయి. 2020-25 నాటికి రూపొందించడానికి అనువైన ప్రాజెక్టల జాబితాను ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ జాతీయ మౌలిక పైప్​లైన్(ఎన్​ఐపీ)రూపొందించింది. అందులో కొన్ని ప్రాజెక్టులు అమలులో ఉన్నాయి.

గత వ్యయాల ఫలితమేంటి?

అయితే గత ఐదేళ్లలో ప్రభుత్వం చేసిన వ్యయాలతో పోలిస్తే తాజా పెట్టుబడులు ఆర్థిక వ్యవస్థకు ఏ విధంగా ఊతమిస్తాయి? మోదీ అధికారంలోకి వచ్చిన 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రభుత్వం రోడ్లు, రహదారులు, ఇళ్లు, పట్టణాలు, డిజిటల్ మౌలిక రంగాల్లో పెద్ద ఎత్తునే పెట్టుబడులు పెట్టింది. ఎన్​ఐపీ గణాంకాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం 2017-18లో తన వ్యయాలను రూ.3.9 ట్రిలియన్లకు పెంచుకుంది. ఇది అంతకుముందుతో పోలిస్తే 2.3 రెట్లు ఎక్కువ. జీడీపీతో పోలిస్తే ఇది 1.4 శాతం నుంచి 2.3 శాతానికి పెరిగింది. 2018-19లో మౌలికంపై కేంద్రం చేసిన ఖర్చు రూ.3.8 ట్రిలియన్లు. దీంతోపాటు ఎన్​ఐపీ ప్రకారం వచ్చే ఏడాది రూ.4.6 ట్రిలియన్లను ఖర్చు చేయడానికి సిద్ధమైంది. మరోవైపు మొత్తం ఎన్​ఐపీ పెట్టుబడులలో 24 శాతం(19.5 ట్రిలియన్ల) పెట్టుబడులను 2020-21 సంవత్సరానికి కేటాయించింది. వచ్చే రెండేళ్లలో కేంద్రం చేసే వ్యయాలు అంతకుముందుతో పోలిస్తే కేవలం రూ.1 ట్రిలియన్​ ఎక్కువ. మరోవైపు తొలి మూడేళ్లలో రాష్ట్రాలు ఎక్కువ పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. 2024,2025 ఆర్థిక సంవత్సరాలలో కేంద్రం తన పెట్టుబడుల శాతాన్ని పెంచనుంది.

డిమాండ్​కు ఊతమిచ్చే కోణంలో సూక్ష్మ ఆర్థిక విధానాలను రూపొందించే కేంద్ర ప్రభుత్వం... ప్రస్తుతం అనుసరించే వైఖరి నుంచి ఏం ఆశించవచ్చు?

గత ఐదేళ్లలో వ్యయాలు ఎక్కువే

ఇంతకుముందు ఐదేళ్లలో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఏమీ లేవు. భారత్​లోని మొత్తం మౌలిక రంగ పెట్టుబడులు 2013-14లో రూ.6.3 ట్రిలియన్ల నుంచి రూ.10 (2017-19 రెండు సంవత్సరాలకు) ట్రిలియన్లకు పెరిగింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ వ్యయాల్లో దాదాపు రెట్టింపు పెరుగుదల నమోదైంది. గత రెండేళ్లలో మౌలిక రంగ పెట్టుబడుల్లో కేంద్రం వాటా రూ. 4 ట్రిలియన్లకు చేరుకుంది. మోదీ తొలి దఫా ప్రభుత్వం మొదటి మూడు సంవత్సరాల్లో మొత్తం పెట్టుబడిలో కేంద్రం వాటా ఒక్కసారిగా 13 శాతం పెరిగింది. 25 శాతంగా ఉన్న పెట్టుబడులు 38 శాతానికి చేరుకున్నాయి.

ఫలితం ప్రతికూలమే..

కానీ వృద్ధి ఫలితాలు ఎలా ఉన్నాయి? దురదృష్టవశాత్తు ఆశించిన దానికి వ్యతిరేకమైన ఫలితమే వచ్చింది. వాస్తవ జీడీపీ వృద్ధి 2017-18లో మందగించింది. 2018-19లో మరింత పతనమైంది. అనంతరం మరింత దిగజారి 5 శాతానికి చేరింది. అంచనాల ప్రకారం ఇది మరింత తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నిరుద్యోగాన్ని పరిశీలిస్తే ద్రిగ్భాంతికర వాస్తవాలు బయటపడుతున్నాయి. ఎన్​ఎస్​ఎస్​ఓ పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2017-18(జాబితా ముందుగానే తయారు చేసినప్పటికి 2019 మేలో విడుదలైంది) ప్రకారం నిరుద్యోగ రేటు 2017-18లో 6.1 శాతంగా నమోదైంది. ఇది 40 ఏళ్ల గరిష్ఠం కావడం గమనార్హం. ప్రైవేట్ గణాంక సంస్థ సీఎంఐఈ సైతం ఇలాంటి అంచనాలే వెలువరించింది. ఈ పరిణామాలు వ్యాపారులు, వినియోగదారుల సెంటిమెంట్లపై ప్రభావాన్ని చూపించాయి. దీంతో వినియోగదారుల వ్యయం కనిష్ఠ స్థాయికి చేరింది. అంతర్జాతీయ పోటీతత్వ సూచీగా పరిగణించే ఎగుమతుల వృద్ధి ఈ ఏడాది 2 శాతంగా నమోదైంది. తయారీ రంగ వృద్ధి 5 శాతానికి చేరింది. అయితే తర్వాతి పరిణామాలన్నీ తయారీ రంగంతో పాటు భారత్​ పోటీతత్వాన్ని మెరుగుపర్చే ఎన్​ఐపీ కోణంతో చూడాల్సి ఉంటుంది.

కారణాలెన్నో

ఈ ఫలితాలన్ని సానుకూలంగా లేవు. ప్రతికూల ఫలితాలకు కారణాలు అనేకం ఉండొచ్చు. ఉదాహరణకు అపరిష్కృతంగా ఉన్న మొండి బకాయిల కారణంగా బ్యాంకులు రుణాలు మంజూరు చేయడానికి వెనక్కి తగ్గడం, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల సంక్షోభం... ఫలితంగా రుణ లభ్యత తగ్గిపోవడం(క్రెడిట్ క్రంచ్), కార్పొరేట్ రుణ లభ్యత సహా అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఈ అంశాలే రాబడి, పెట్టుబడులు, ఉద్యోగ కల్పనపై తీవ్ర ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.

మౌలికం లేకపోతే మరింత నష్టం

మరోవైపు ప్రతికూల పరిస్థితులను తక్కువగా అంచనా వేయకూడదు. మౌలిక వసతులలో పెట్టుబడులు లేకపోతే వృద్ధి మరింత తగ్గే అవకాశం ఉంది.ఈ పెట్టుబడులు మొత్తం 60-80 శాతం నిర్మాణ భాగస్వామ్యం ఉంటుందని భావిస్తారు. భారత్​లో అధిక ఉద్యోగ కల్పన జరిగే రంగాల్లో నిర్మాణ రంగం ఒకటి. అయితే జనవరి 7న విడుదల చేసిన ముందస్తు జీడీపీ అంచనాల ప్రకారం ఉద్యోగ కల్పన సైతం మందగించినట్లు స్పష్టమవుతోంది. ఈ రంగంలో ఏడాది క్రితం 8.7 శాతం ఉన్న ఉద్యోగ కల్పన రేటు ప్రస్తుతం 3.2 శాతానికి పడిపోయింది. 2017-19 ఆర్థిక సంవత్సరాల మధ్య మౌలిక రంగంలో పెట్టుబడులు లేకపోయినట్లయితే మరింత దిగజారే ప్రమాదం ఉండేది.

మౌలిక పెట్టుబడులు పెంచడం వల్ల వృద్ధిలో పెరుగుదల నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో... ఉద్దీపన చర్యలు తగ్గించడం లేదా, పూర్తిగా ఆపేయడం వల్ల వృద్ధిలో మరింత క్షీణత ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఉద్దీపన కోసం కేంద్రం తాజాగా ప్రతిపాదించిన మౌలిక పెట్టుబడుల అంచనాలను తగ్గించాలి. లేకుంటే భవిష్యత్తులోనూ ప్రగతి మరింత పతనమయ్యే అవకాశం ఉంటుంది.

--రేణు కోహ్లీ, ఆర్థికవేత్త

Mumbai, Jan 14 (ANI): While speaking to media in Mumbai on January 14, the veteran leader of Shiv Sena Sanjay Raut spoke on withdrawal of book 'Aaj ke Shivaji: Narendra Modi'. He said, "This was a matter of honour and pride of Chhatrapati Shivaji Maharaj and Maharashtra." "BJP has withdrawn the book and apologised for it, so I think the matter should be put to rest," he added.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.