ఆర్టీజీఎస్ వ్యవస్థను కొద్ది రోజుల్లోనే 24 గంటల పాటు అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించారు గవర్నర్ శక్తికాంత దాస్. కాంటాక్ట్‌లెస్ కార్డ్ లావాదేవీల పరిమితిని జనవరి నుంచి రూ. 2 వేల నుంచి రూ.5 వేలకు పెంచుతున్నట్లు చెప్పారు. వాణిజ్య, సహకార బ్యాంకులు 2019-20లో వచ్చిన లాభాలను నిలుపుకోవాలని సూచించారు. చాలా రంగాలు రికవరీ మార్గంలోకి వస్తున్న క్రమంలో ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటుందని తెలిపారు.
మూడో త్రైమాసికంగా సీపీఐ ద్రవ్యోల్బణం 6.8 శాతం, క్యూ4లో 5.8 శాతానికి పరిమితమవుతుందని అంచనా వేసింది ఆర్బీఐ.