కరోనా నేపథ్యంలో ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టుల గడువును ఆరు నెలల పాటు పొడిగించినట్టు ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) ప్రకటించింది. కూలీలు స్వస్థలాలకు వెళ్లడం, నిర్మాణ సామగ్రి సకాలంలో అందకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో స్థిరాస్తి వ్యాపారులు సకాలంలో ఇళ్లు నిర్మించి ఇవ్వలేరని అందువల్లనే గడువు పెంచామని పేర్కొంది. అదే సమయంలో కొనుగోలుదార్ల ప్రయోజనాల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్టు వివరించింది. సమాచార్ ఫౌండేషన్ డైరెక్టర్ బి.ఎన్.కుమార్ సమర్పించిన వినతిపత్రానికి స్పందిస్తూ పీఎంఓ ఈ మేరకు లేఖ రాసింది.
ఇదీ చూడండి: 3- 4 ఏళ్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్ విభజన!