శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రపంచం దూకుపోతోంది అంటాం. ఎలా? అంటే.. ఎలాన్ మస్క్ లాంటి వారి వల్ల! అనునిత్యం వినూత్న ఆలోచనలతో, కలలను నిజం చేసుకోసువడానికి నిర్భయంగా కష్టపడే వ్యక్తి.. మస్క్. స్పేస్ఎక్స్ లాంటివి ఎన్నిసార్లు విఫలమైనా.. విజయవంతం చేసేంత వరకు పట్టువదలకుండా ప్రయత్నించి తానెంత మొండిఘటమో నిరూపించుకున్నారు ఆయన. వీడియో గేమ్స్‌తో మొదలై.. ఆన్లైన్ పేమెంట్ పోర్టల్ నడిపి, ప్రస్తుతం మార్స్‌పై పాగా వేసేందుకు సిద్ధమవుతున్న మస్క్ జీవితం ఎవరికీ అంతుబట్టనిది. నేడు(జూన్ 28) ఆయన 50వ పుట్టినరోజు.
మస్క్ జీవితంలో ఆసక్తికర మలుపులు..
- దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో పుట్టారు మస్క్.
- 12 ఏళ్లకే వీడియో గేమ్ తయారు చేసి.. ఓ కంప్యూటర్ మేగజైన్‌కు అమ్మేశారు ఎలాన్ మస్క్.
- మెరుగైన అవకాశాల కోసం 17 ఏళ్ల వయసులో కెనడా వెళ్లారు.
- 24 ఏళ్ల వయసులో జిప్ 2ను స్థాపించిన మస్క్.. అనంతరం దానిని రూ.2300 కోట్లకు అమ్మేశారు.
- ఎక్స్.కామ్ అనే సంస్థను కొందరు స్నేహితులతో కలిసి తన 28వ ఏట నెలకొల్పారు మస్క్. అదే అనంతరం పేపాల్గా అవతరించింది.
- ఆ తర్వాత రెండేళ్లకు తన 30వ ఏట పేపాల్‌ను ఈకామర్స్ సంస్థ ఈబేకు విక్రయించారు.
- 31 ఏళ్లకు స్పేస్ఎక్స్ స్థాపించారు.
- 33 ఏళ్లకు టెస్లాలో చేరారు.
- 41 ఏళ్లకు బిలియనీర్‌గా ఎదిగారు.
- 49వ ఏట ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా అవతరించారు.
హ్యాపీ బర్త్‌డే.. డాజ్ఫాదర్
ఎలాన్ మస్క్‌కు ప్రపంచవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రేపటికి దార్శనికుడని, తమకు ఆదర్శప్రాయుడని ఎంతో మంది ఆయనను కీర్తిస్తున్నారు.
తన కుమారుడి చిన్ననాటి ఫొటో షేర్ చేసి ప్రేమను పంచుకున్నారు మస్క్ తల్లి మయే మస్క్.
కాగా, ఎలాన్‌ను సరదాగా డాజ్ఫాదర్ అని పిలుస్తూ శుభాకాంక్షలు తెలిపారు అభిమానులు.
ఇవీ చూడండి:
మస్క్ సంపద ఒక్కరోజే రూ.1.8 లక్షల కోట్లు వృద్ధి