ETV Bharat / business

పెరగనున్న టర్మ్ బీమా ప్రీమియం! - బీమారంగం నిపుణులు

గత కొన్నేళ్లుగా టర్మ్​ పాలసీలపై చాలామందికి అవగాహన ఏర్పడింది. వేర్వేరు బీమా సంస్థలు తక్కువ ప్రీమియం, ఎక్కువ కవరేజీ ఇస్తుండటం వల్ల.. పాలసీదారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా సంక్షోభం కారణంగా.. ఈ బీమా కంపెనీలకు మరింత ప్రాధాన్యం ఏర్పడిందని విశ్లేషకులు అంటున్నారు. ఫలితంగా టర్మ్ పాలసీల ప్రీమియం పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

Term Policy premium to go up
పెరగనున్న టర్మ్ బీమా ప్రీమియం!
author img

By

Published : Mar 3, 2021, 10:37 AM IST

గత కొన్ని సంవత్సరాలుగా టర్మ్ పాలసీల గురించి చాలా మందికి అవగాహన పెరిగింది. తక్కువ ప్రీమియం ఎక్కువ కవరేజీ ఉండటం వల్ల.. వీటిని తీసుకునే వారి సంఖ్యలో వృద్ధి చాలా కనబడింది. ఇప్పుడు ఇవి చాలా పాపులర్ పాలసీలుగా ఉన్నాయి.

కొవిడ్ వల్ల ఆరోగ్యంతో పాటు బీమాకు సంబంధించిన అవగాహన ఎక్కువైంది. కొవిడ్ వల్ల క్లెయిమ్​లు కూడా పెరిగినట్లు బీమా సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. అయితే.. టర్మ్ పాలసీల ప్రీమియం పెరిగే అవకాశాలు ఉన్నట్లు బీమా రంగంలో పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

సాధారణంగా బీమా కంపెనీలు.. రిస్కును తగ్గించుకునేందుకు తిరిగి బీమా చేయించుకుంటాయి. ఇందుకోసం రీ-ఇన్సూరెన్స్ కంపెనీలపై ఆధారపడుతుంటాయి. కరోనా వల్ల మరణాల సంఖ్య పెరిగింది. దీనివల్ల అవి ప్రీమియం పెంచాయని, ఫలితంగా బీమా కంపెనీలు కూడా ప్రీమియం పెంచే అవకాశం ఉందని ఆ రంగం నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కొత్తగా తలెత్తుతున్న రిస్కులను కూడా దృష్టిలో ఉంచుకొని ఈ ప్రీమియం పెంపును నిర్ణయించనున్నట్లు అంచనా వేస్తున్నారు.

గ్లోబల్ మహమ్మారి కావటమే కారణం..

రీ-ఇన్సూరెన్స్ కంపెనీలు అన్ని భౌగోళిక ప్రాంతాల్లో పోర్ట్ ఫోలియోను కలిగి ఉంటాయి. ఒక ప్రాంతంలో వైపరీత్యాలు సంభవించినప్పుడు ఆ ప్రాంతంలో మాత్రమే క్లెయిమ్​లు పెరుగుతాయి. వేరే ప్రాంతంలో క్లెయిమ్​లు పెరగవు. దీనివల్ల రిస్కును తగ్గించుకుంటాయి. అయితే.. ఇప్పుడొచ్చిన మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఉండటం వల్ల మరణాల సంఖ్యపై రీ-ఇన్సూరెన్స్ కంపెనీలు వేసిన అంచనాలు మారిపోయాయని.. దీనితో రిస్కు అంచనాలను మార్చుకోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

తగ్గిన ప్రీమియం..

టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ రంగంలో పోటీ పెరగటం వల్ల ప్రీమియంలు కొన్నేళ్ల క్రితం తగ్గిపోయాయని నిపుణులు చెబుతున్నారు. అయితే.. గత కొన్ని సంవత్సరాలుగా మరణాల సంఖ్య పెరిగిందని, కొవిడ్ కారణంగా చనిపోయేవారి సంఖ్య ఇంకా ఎక్కువైపోయిందని.. ఫలితంగా రీ-ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రీమియంలను పెంచాయని వారు చెబుతున్నారు.

ఇదీ చదవండి: నెరవేరని 'ఒకే దేశం.. ఒకే పాలసీ' లక్ష్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.