ETV Bharat / business

భారత్‌లో 5జీ ట్రయల్స్‌కు గ్రీన్​ సిగ్నల్ - 5జీ ట్రయల్స్‌కు గ్రీన్​ సిగ్నల్

భారత్‌లో 5జీ టెక్నాలజీ, స్పెక్ట్రమ్‌ ట్రయల్స్‌కు టెలికాం శాఖ అనుమతి ఇచ్చింది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఎమ్‌టీఎన్‌ఎల్​ ట్రయల్స్​ నిర్వహించవచ్చని తెలిపింది.

5G trials
భారత్‌లో 5జీ స్పెక్ట్రమ్‌ ట్రయల్స్‌కు టెలికాం శాఖ అనుమతి
author img

By

Published : May 4, 2021, 6:24 PM IST

Updated : May 4, 2021, 7:05 PM IST

భారత్‌లో 5జీ టెక్నాలజీ అందుబాటులోకి తెచ్చే దిశగా కీలక అడుగు పడింది. 5జీ ట్రయల్స్ నిర్వహించడానికి ప్రముఖ టెలికాం కంపెనీలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఎమ్‌టీఎన్‌ఎల్​కు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ఈ సంస్థలు ఏవీ చైనాకు చెందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించకూడదని స్పష్టం చేసింది.

ఈ ట్రయల్స్ కోసం ఎరిక్సన్​, నోకియా, సామ్‌సంగ్​, రిలయన్స్​ జియో అభివృద్ధి చేసిన సాంకేతికతలు మాత్రమే ప్రభుత్వం కేంద్రం ఆమోదించిన 5జీ గేర్​ తయారీదారుల జాబితాలో ఉన్నాయి.

"5జీ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ట్రయల్స్ నిర్వహించడానికి టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు టెలికమ్యూనికేషన్ విభాగం అనుమతి ఇచ్చింది. ఇందుకు దరఖాస్తు చేసిన వాటిలో భారతీ ఎయిర్​టెల్ లిమిటెడ్, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్, వొడాఫోన్-ఐడియా లిమిటెడ్, ఎంటీఎన్ఎల్ ఉన్నాయి."

- టెలి కమ్యూనికేషన్స్ శాఖ

5జీ ట్రయల్స్ నిర్వహించడానికి భారతీ ఎయిర్​టెల్​, వొడాఫోన్​-ఐడియా చైనాకు చెందిన హువావే అభివృద్ధి చేసిన సాంకేతికతను ఉపయోగించుకుంటామని ప్రతిపాదించాయి. ఆయితే ఇందుకు కేంద్రం అడ్డుచెప్పింది. హువావేకు బదులు మరో టెక్నాలజీ ఉపయోగిస్తామని హామీ ఇవ్వడం వల్ల ట్రయల్స్​కు కేంద్రం అనుమతి ఇచ్చింది.

ఇదీ చూడండి: దేశం ముంగిట సాంకేతిక విప్లవం!

Last Updated : May 4, 2021, 7:05 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.