ETV Bharat / business

ఉద్యోగాల జాతర.. ఆ సంస్థలో 40వేల పోస్టుల భర్తీ! - tcs hiring news

ఉద్యోగం కోసం వేచి చూస్తున్న వారికి నిజంగా ఇది శుభవార్తే. కరోనా సంక్షోభంలోనూ ప్రముఖ సాఫ్ట్​వేర్​ దిగ్గజ సంస్థ​ ఈ ఏడాది భారీ సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. 40 వేలకుపైగా మందిని భర్తీ చేస్తామని వెల్లడించింది.

TCS hiring, tcs job openings
టీసీఎస్​, టీసీఎస్​ క్యాంపస్​ నియామకాలు
author img

By

Published : Jul 9, 2021, 5:26 PM IST

Updated : Jul 9, 2021, 5:36 PM IST

ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసస్​ (టీసీఎస్) ఈ ఆర్థిక సంవత్సరంలో భారీగా నియామకాలు చేపట్టనుంది. సుమారు 40వేలకు పైగా ఉద్యోగులను కొత్తగా తీసుకోనుంది. ఈ మేరకు సంస్థకు చెందిన ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.

ప్రైవేటు రంగంలో సుమారు 5 లక్షల మంది ఉద్యోగులతో అతిపెద్ద సంస్థగా ఉన్న టీసీఎస్​..గతేడాది క్యాంపస్​ సెలక్షన్స్ ద్వారా 40 వేల మందిని నియమించుకుంది. అయితే ఈ ఏడాది కూడా అంతకంటే ఎక్కువ మందిని తీసుకునేందుకు చూస్తున్నట్లు ఆ సంస్థ హెచ్​ఆర్​ చీఫ్​ మిలింద్​​ లక్కడ్​ తెలిపారు.

ఈ నియామకాల మీద కరోనా ఆంక్షల ప్రభావం ఏమీ ఉండడం లేదని మిలింద్​ చెప్పారు. గతేడాది కూడా ప్రవేశ పరీక్ష కోసం 3.60 లక్షల మంది ఫ్రెషర్లు వర్చువల్​ విధానంలో హాజరయ్యారని పేర్కొన్నారు.

"గతేడాది క్యాంపస్​ సెలక్షన్స్​ ద్వారా 40 వేల మందిని తీసుకున్నాం. ఈ ఏడాది కూడా అలానే 40 వేలకు మించి నియమించుకోవాలని చూస్తున్నాం. అమెరికా​ క్యాంపస్​ల నుంచి 2వేల మందిని ట్రైనీలుగా గతేడాది సెలెక్ట్​ చేశాం."

-మిలింద్​ లక్కడ్, హెచ్​ఆర్​ చీఫ్​

ఇదీ చూడండి: తొలి త్రైమాసికంలో దుమ్మురేపిన టీసీఎస్

Last Updated : Jul 9, 2021, 5:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.