ETV Bharat / business

క్యూ4 ఫలితాల్లో దుమ్మురేపిన టీసీఎస్​ - TCS Q4 consolidated net profit

ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసస్​ (టీసీఎస్) నాలుగో త్రైమాసికంలో భారీ లాభాలు ఆర్జించింది. క్యూ4 ఫలితాలను సోమవారం వెల్లడించిన సంస్థ నికర లాభం 14.9 శాతం పెరిగిందని తెలిపింది.

TCS Q4 consolidated net profit up 14.9 pc at Rs 9,246 crore; revenue rises 9.4 pc to Rs 43,705 crore
టీసీఎస్​కు లాభాల పంట
author img

By

Published : Apr 12, 2021, 7:24 PM IST

Updated : Apr 12, 2021, 7:52 PM IST

2020-21 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో టీసీఎస్​కు లాభాల పంట పండింది. సంస్థ నికర లాభం 14.9 శాతం పెరిగి రూ.9,246 కోట్లకు చేరింది. గతేడాది ఇదే సమయానికి ఆ సంస్థ నికర లాభం రూ.8,049 కోట్లుగా ఉంది.

క్యూ4లో కేవలం టీసీఎస్​ ఆదాయం 9.4 శాతం పెరిగి రూ. 43,705 కోట్లకు చేరింది.

"దశాబ్ద కాలంగా మంచి అవకాశం ఉండే రంగాల్లో పెట్టుబడులు పెడుతూ వస్తున్నాం. కొత్త సామర్థ్యాలను సృష్టించుకున్నాం. భవిష్యత్తులో ఇంకా మెరుగైన లాభాలు ఆర్జిస్తాం. ఈ లాభాలతో విపణిలో మరిన్ని అవకాశాలు రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తాం."

-రాజేశ్​ గోపీనాథన్, టీసీఎస్ సీఈఓ

ఈక్విటీ షేరుకు రూ.15 మేర డివిడెండ్‌ ఇవ్వడానికి టీసీఎస్​ డైరెక్టర్ల బోర్డు ప్రతిపాదించింది.

ఇదీ చూడండి: టీసీఎస్​ను వెనక్కినెట్టి మళ్లీ నెంబర్​వన్​గా రిలయన్స్​

Last Updated : Apr 12, 2021, 7:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.