2020-21 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో టీసీఎస్‌కు లాభాల పంట పండింది. సంస్థ నికర లాభం 7.2శాతం పెరిగి రూ.8,701 కోట్లకు చేరింది. క్యూ3లో టీసీఎస్ ఇంతటి లాభాన్ని ఆర్జించడం గత 9 ఏళ్లలో ఇదే తొలిసారి. గతేడాది ఇదే సమయానికి ఆ సంస్థ నికర లాభం రూ.8,118 కోట్లుగా ఉంది.
క్యూ3లో టీసీఎస్ ఆదాయం 5.4 శాతం పెరిగి రూ. 42,015 కోట్లకు చేరింది.
"వినియోగదారులు పెరగడం, కోర్ ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్‌కు డిమాండ్ పెరగడం ఇంతటి లాభాలకు ప్రధాన కారణం."
-రాజేశ్ గోపీనాథన్, టీసీఎస్ సీఈఓ
అన్ని విభాగాల్లోనూ సంస్థకు లాభాలు వచ్చాయని చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) రామకృష్ణన్ తెలిపారు. ఈ లాభాలతో విపణిలో మరిన్ని అవకాశాలు రాబట్టుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి : టీకా జోష్- మార్కెట్ల ఆల్‌టైమ్ రికార్డ్