మానసిక వైకల్యంతో బాధపడేవారిని బీమా పరిధిలోకి తెచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీం కోర్టులో వాజ్యం దాఖలయ్యింది. మానసిక ఆరోగ్య చట్టం 2017లోని సెక్షన్ 24(1) ప్రకారం మానసిక వైకల్యం ఉన్న వారికీ బీమా పాలసీలు జారీ చేయాలని నిర్దేశించినా.. ఒక్క బీమా సంస్థ కూడా పాటించలేదని గౌరవ్ కుమార్ బన్సాల్ అనే న్యాయవాది సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఇది సమానత్వపు హక్కుకు వ్యతిరేకమని పేర్కొన్నారు.
ఆగస్టు 16, 2018లో మానసిక వైకల్యం ఉన్న వారిని బీమా పరిధిలోకి తీసుకురావాలని ఐఆర్‌డీఏ మార్గదర్శకాలు జారీ చేసిందని, అయినప్పటికీ ఒక్క బీమా సంస్థా వీటిని అమలు చేయడం లేదని పిటిషన్‌లో తెలిపారు. దీన్ని విచారించిన జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్, జస్టిస్ నవీన్ సిన్హా, జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం.. సమాధానం తెలియజేయాలంటూ కేంద్రానికీ, ఐఆర్‌డీఏకూ నోటీసులు ఇచ్చింది.
ఇదీ చూడండి: కరోనా వేళ సెకండ్ హ్యాండ్ వస్తువులు సురక్షితమేనా?