ఆర్థిక వృద్ధిపై ఆందోళనలు, వాహన రంగంలో ఇబ్బందులు, విదేశీ సంస్థాగత పెట్టుబడుల ఉపసంహరణ, పెరుగుతున్న ముడిచమురు ధరలతో... దేశీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు వెలువడడం ఇందుకు తోడైంది. ఫలితంగా స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 131 పాయింట్లు కోల్పోయి 36 వేల 850 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 35 పాయింట్లు నష్టపోయి 10 వేల 910 వద్ద ట్రేడవుతోంది.
లాభనష్టాలు
యూపీఎల్, సన్‌ఫార్మా, భారతీ ఎయిర్టెల్, హెచ్‌యూఎల్, ఎల్ అండ్ టీ, రిలయన్స్ లాభాల్లో కొనసాగుతున్నాయి.
టాటా మోటార్స్, మారుతీ సుజూకీ, టాటా స్టీల్, వేదాంత, హెచ్‌సీఎల్ టెక్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
ఆసియా మార్కెట్లు
నిక్కీ, కోస్పీ, షాంఘై మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతుండగా..... హాంగ్‌సెంగ్ సూచీ నష్టాల్లో కొనసాగుతోంది.
ఇదీ చూడండి: సరికొత్త ఆవిష్కరణలతో అదరగొడుతున్న ఐఎఫ్ఏ!