బ్యాంకింగ్ షేర్ల దన్ను..
స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. బ్యాంకింగ్ షేర్ల దన్నుతో సెన్సెక్స్ 290 పాయింట్లు బలపడి 34,247 వద్దకు చేరింది. నిఫ్టీ 69 పాయింట్లు పెరిగి.. 10,116 వద్ద స్థిరపడింది.
- ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
- హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, టైటాన్, టాటా స్టీల్, ఓఎన్జీసీ, ఎం&ఎం, ఎల్&టీ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.