ఒడుదొడుకుల్లోనూ లాభాలే..
స్టాక్ మార్కెట్లు ఆరంభంలో ఒడుదొడుకులు ఎదుర్కొన్నా చివరకు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 187 పాయింట్లు బలపడి 36,674 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 36 పాయింట్ల లాభంతో 10,800 వద్దకు చేరింది.
- బ్యాంకింగ్, ఐటీ షేర్లు లాభాలు నమోదుచేశాయి.
- బజాజ్ ఫినాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి.
- పవర్‌గ్రిడ్, ఎన్టీపీసీ, ఐటీసీ, టాటా స్టీల్, ఓఎన్జీసీ, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టపోయాయి.