అంతర్జాతీయ సానుకూలతలతో దేశీయ మార్కెట్లు లాభాలతో దూసుకెళ్తున్నాయి. అన్‌లాక్ 2.0 ప్రారంభం కావడం, ఆర్బీఐ కీలక సంస్కరణలు ప్రకటించడం కూడా దీనికి కలిసొచ్చింది.
ముంబయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 266 పాయింట్లు లాభపడి 35 వేల 681 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 81 పాయింట్లు వృద్ధిచెంది 10 వేల 511 వద్ద ట్రేడవుతోంది.
దేశ ఆర్థిక వృద్ధి గాడిన పడుతుండటం సహా కొవిడ్ వ్యాక్సిన్‌పై పెరుగుతున్న ఆశలు.. మదుపరుల సెంటిమెంట్‌ను పెంచినట్లు ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
లాభనష్టాల్లో
ఓఎన్జీసీ, ఎం అండ్ ఎం, ఇండస్ఇండ్ బ్యాంకు, ఎల్ అండ్ టీ, టైటాన్ రాణిస్తున్నాయి.
టెక్ మహీంద్రా, హెచ్‌యూఎల్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లు
షాంఘై కాంపోజిట్, కోస్పీ, హాంగ్ సెంగ్, నిక్కీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. మరోవైపు వాల్‌స్ట్రీట్ కూడా లాభాలతో ముగిసింది.
ముడిచమురు ధరలు
అంతర్జాతీయ విపణిలో ముడిచమురు ధర 0.12 శాతం పెరిగింది. ప్రస్తుతం బ్యారెల్ ధర రూ.42.08 డాలర్లుగా ఉంది.