ఆర్థిక షేర్లు పడేశాయ్..
స్టాక్ మార్కెట్ల వరుస లాభాల జోరుకు అడ్డుకట్టపడింది. గురువారం సెషన్లో సెన్సెక్స్ 129 పాయింట్లు నష్టంతో 33,981 వద్దకు చేరింది. నిఫ్టీ 32 పాయింట్లు కోల్పోయి 10,029 వద్ద స్థిరపడింది. ఆర్థిక రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నష్టాలకు కారణంగా నిపుణులు చెబుతున్నారు.
లాభనష్టాల్లోని షేర్లు..
గురువారం సెషన్లో టెక్ మహీంద్రా, సన్‌ఫార్మా, భారతీ ఎయిర్టెల్, పవర్ గ్రిడ్, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు లాభపడ్డాయి.
ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫినాన్స్, హెచ్డీఎఫ్సీ, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి.