ETV Bharat / business

స్టాక్ మార్కెట్లు: ఆరంభంలో అయ్యయ్యో.. ముగింపు భళా - షేర్ మార్కెట్లు

stocks today
స్టాక్​ మార్కెట్లు
author img

By

Published : Jun 18, 2020, 9:56 AM IST

Updated : Jun 18, 2020, 3:59 PM IST

15:52 June 18

భయాలున్నా బుల్ జోష్​..

సర్వత్రా ప్రతికూలతలు ఉన్నా స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 700 పాయింట్లు బలపడి 34,208 వద్ద స్థిరపడంది. నిఫ్టీ 210 పాయింట్లు పుంజుకుని 10,092 వద్దకు చేరింది.  

  • సరిహద్దు వివాదాలు, దేశీయ రేటింగ్ తగ్గిస్తూ రేటింగ్ ఏజెన్సీలు నివేదికలు విడుదల చేయడం వంటి ప్రతికూలతల్లోనూ దిగ్గజ సంస్థలు రాణించడం లాభాలకు దన్నుగా నిలిచినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
  • బజాజ్ ఫినాన్స్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, పవర్​ గ్రిడ్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, ఎస్​బీఐ షేర్లు లాభాలను నమోదు చేసాయి.
  • ఓఎన్​జీసీ, హెచ్​యూఎల్​, టీసీఎస్​, భారతీ ఎయిర్​టెల్, మారుతీ, సన్​ఫార్మా షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

14:19 June 18

బుల్ జోష్​..

స్టాక్ మార్కెట్లలో బుల్​ జోరు కొనసాగుతోంది. సెషన్ చివరి గంటలో సెన్సెక్స్ 610 పాయింట్లకుపైగా పెరిగి 34,124 వద్దకు చేరింది. నిఫ్టీ 190 పాయింట్లకుపైగా వృద్ధితో 10,071 వద్ద ట్రేడవుతోంది.

ఇంధన, ఎఫ్​ఎంసీజీ రంగాలు తప్పా మిగతా షేర్లన్నీ లాభాల్లో ఉన్నాయి.

బజాజ్ ఫినాన్స్, పవర్​గ్రిడ్, కోటక్ హ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ, ఐటీసీ ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.

ఓఎన్​జీసీ, సెస్లే, హెచ్​యూఎల్​, బజాజా అటో, సన్​ఫార్మా షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

13:24 June 18

కొనసాగుతున్న జోరు..

స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 360 పాయింట్లు బలపడి 33,870 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 110 పాయింట్లకుపైగా లాభంతో 9,992 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.

  • ఆర్థిక, విద్యుత్, లోహ రంగం షేర్లు సానుకూలంగా స్పందిస్తుండటం లాభాలకు ప్రధాన కారణం.
  • బజాజ్ ఫినాన్స్, పవర్​గ్రిడ్, ఐటీసీ, ఎన్​టీపీసీ, టాటా స్టీల్, హెచ్​డీఎఫ్​సీ లాభాల్లో ఉన్నాయి.
  • ఓఎన్​జీసీ, బజాజ్ ఆటో, మారుతీ, నెస్లే, హెచ్​యూఎల్​, హీరో మోటోకార్ప్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. వాహన రంగంలో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది.

12:05 June 18

మిడ్​ సెషన్​లో దూకుడు..

స్టాక్ మార్కెట్లు మిడ్​ సెషన్​లో భారీ లాభాల దిశగా కదులుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 250 పాయింట్ల లాభంతో 33,760 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 80 పాయింట్లకుపైగా బలపడి 9,963 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.  

  • బజాజ్ ఫినాన్స్, పవర్​గ్రిడ్, ఐటీసీ, టాటా స్టీల్, కోటక్ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ, ఎన్​టీపీసీ, భారతీ ఎయిర్​టెల్ లాభాల్లో ఉన్నాయి.
  • మారుతీ, ఓఎన్​జీసీ, హెచ్​యూఎల్​, నెస్లే, హీరో మోటోకార్ప్ నష్టాల్లో ఉన్నాయి.
  • హెవీ వెయిట్​ షేర్లన్నీ దాదాపుగా సానుకూలంగా స్పందిస్తుండటం లాభాలకు ప్రధాన కారణం.

10:26 June 18

లాభాలొచ్చాయ్​..

ఒడుదొడుకుల నుంచి లాభాల్లోకి దూసుకెళ్తున్నాయి స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 100 పాయింట్లకుపైగా పుంజుకుని 33,610 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 40 పాయింట్లకుపైగా లాభంతో 9,926 వద్ద కొనసాగుతోంది.

  • హెవీ వెయిట్​ షేర్లు లాభాలకు దన్నుగా నిలుస్తున్నాయి.
  • బజాజ్ ఫినాన్స్, పవర్​గ్రిడ్, ఐటీసీ, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, హెచ్​డీఎఫ్​సీ, రిలయన్స్​, ఎస్​బీఐ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • ఓఎన్​జీసీ, టీసీఎస్​, ఎల్​&టీ, హెచ్​యూఎల్​, ఎన్​టీపీసీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
  • ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లు.. హాంకాంగ్, దక్షిణ కొరియా, జపాన్ సూచీలు నష్టాలతో సెషన్ ప్రారంభించాయి. షాంఘై సూచీ మాత్రం లాభాల్లో ట్రేడవుతోంది.
  • ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ 0.71 శాతం తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్​లో బ్యారెల్ ముడి చమురు ధర 40.42 డాలర్లుగా ఉంది.

09:31 June 18

కొనసాగుతున్న అప్రమత్తత

స్టాక్ మార్కెట్లు గురువారం ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 40 పాయింట్లకుపైగా క్షీణతతో.. 33,468 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ దాదాపు 6 పాయింట్లు కోల్పోయి 9,906 వద్ద ఫ్లాట్​గా కొనసాగుతోంది. 

  • భారత్-చైనా సరిహద్దుల వెంబడి నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
  • ఇన్ఫోసిస్, పవర్​గ్రిడ్, టాటా స్టీల్, బజాజ్ ఫినాన్స్, ఏషియన్ పెయింట్స్ లాభాల్లో ఉన్నాయి.
  • ఓఎన్​జీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్​టీపీసీ, కోటక్ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

Last Updated : Jun 18, 2020, 3:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.