ETV Bharat / business

చివరి గంటలో అమ్మకాలు- మార్కెట్లకు నష్టాలు - సెన్సెక్స్

స్టాక్ మార్కెట్లు వారంలో రెండో రోజూ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 46 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 10 పాయింట్లు తగ్గింది. హెవీ వెయిట్​ షేర్లు ఒడుదొడుకులు ఎదుర్కొనడం నష్టాలకు కారణం.

stock markets today
నేటి స్టాక్ మార్కెట్లు
author img

By

Published : Jun 30, 2020, 3:42 PM IST

Updated : Jun 30, 2020, 7:53 PM IST

స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 46 పాయింట్లు కోల్పోయి 34,916 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 10 పాయింట్ల క్షీణతతో 10,302 వద్దకు చేరింది.

అంతర్జాతీయ సానుకూలతలు, హెవీ వెయిట్​ షేర్ల దన్నుతో ఆరంభంలో లాభాలు నమోదు చేసిన సూచీలు.. చివరి గంటలో అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి.

చివరి గంటలో అమ్మకాలు- మార్కెట్లకు నష్టాలు

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 35,234 పాయింట్ల అత్యధిక స్థాయి, 34,813 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 10,401 పాయింట్ల గరిష్ఠ స్థాయి; 10,267 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..
నెస్లే, మారుతీ, ఐసీఐసీఐ, అల్ట్రాటెక్​ సిమెంట్, టాటా స్టీల్, హెచ్​డీఎఫ్​సీ షేర్లు లాభాలను గడించాయి.

పవర్​గ్రిడ్, సన్​ఫార్మా, భారతీ ఎయిర్​టెల్, ఓఎన్​జీసీ, బజాజ్ ఫినాన్స్, హెచ్​డీఎఫ్​సీ షేర్లు నష్టపోయాయి.

రూపాయి..

కరెన్సీ మార్కెట్లో రూపాయి మంగళవారం 7 పైసలు పుంజుకుంది. డాలర్​తో పోలిస్తే మారకం విలువ 75.51 వద్ద స్థిరపడింది.

ఇదీ చూడండి:జులైలో 'ఆటో' గేరు మారుతుందా?

Last Updated : Jun 30, 2020, 7:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.