స్టాక్‌మార్కెట్ల వరుస ఐదురోజుల లాభాలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ ప్రతికూల సూచనల మధ్య తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్న సూచీలు చివరకు నష్టాలతో ముగిశాయి. ఇండెక్స్ హెవీవెయిట్స్ రిలయన్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు నష్టాలు నమోదుచేశాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 345 పాయింట్లు కోల్పోయి 36 వేల 329 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 93 పాయింట్లు నష్టపోయి 10 వేల 705 వద్ద స్థిరపడింది.
ట్రేడర్స్ ప్రకారం, కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి. ఈ ప్రభావం దేశీయ స్టాక్‌మార్కెట్లపైనా పడింది.
లాభనష్టాల్లో
ఇండస్ఇండ్ బ్యాంకు, ఎస్బీఐ, టాటాస్టీల్, ఐటీసీ, సన్‌ఫార్మా, హెచ్డీఎఫ్సీ బ్యాంకు రాణించాయి.
బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్సెర్వ్, హెచ్‌సీఎల్ టెక్, మారుతి సుజుకీ, ఇన్ఫోసిస్, టీసీఎస్, టైటాన్ నష్టపోయాయి.
ఆసియా మార్కెట్లు
షాంఘై, హాంకాంగ్ మార్కెట్లు రాణించగా... టోక్యో, సియోల్ సూచీలు నష్టపోయాయి. మరోవైపు ఐరోపా మార్కెట్లు కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి.
రూపాయి
రూపాయి విలువ 9 పైసలు తగ్గి, డాలరుకు రూ.75.02గా ఉంది.
చమురు ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర 0.16 శాతం తగ్గింది. ప్రస్తుతం బ్యారెల్ ధర 43.01 డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి: కరోనా ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించే మార్గాలివి...