చమురు సంక్షోభం సహా కరోనా భయాలు ఉన్నా స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 743 పాయింట్లు బలపడి 31,379 వద్దకు చేరింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 206 పాయింట్ల వృద్ధితో 9,187 వద్ద స్థిరపడింది.
జియో-ఫేస్‌బుక్ మధ్య కుదిరిన రూ.43,574 వేల కోట్ల ఒప్పందంతో రిలయన్స్ షేర్లు నేడు దూసుకెళ్లాయి. వీటికి తోడు హెవీ వెయిట్ షేర్ల దన్ను నేటి లాభాలకు దన్నుగా కారణంగా చెబుతున్నారు నిపుణులు.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 31,471 పాయింట్ల అత్యధిక స్థాయి 30,578 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 9,210 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 8,946 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లో...
రిలయన్స్ (10 శాతానికిప, ఏషియన్ పెయింట్స్, మారుతీ, నెస్లే, హీరో మోటోకార్ప్, హెచ్‌యూఎల్ షేర్లు లాభాలను గడించాయి.
ఓఎన్‌జీసీ, ఎల్&టీ, పవర్ గ్రిడ్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.
ఇదీ చూడండి:వాణిజ్యం పేరుతో చైనా ఆధిపత్య వ్యూహం