ETV Bharat / business

జియోలో ఫేస్​బుక్​ 5.7 బిలియన్ డాలర్ల పెట్టుబడి! - జియో ఫేస్​బుక్

జియో ప్లాట్​ఫాంలో సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్​బుక్​ భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. 5.7 బిలియన్ డాలర్ల పెట్టుబడితో సంస్థలో వాటాను సొంతం చేసుకోనున్నట్లు తెలిపింది. ఈ లావాదేవీ ఫలితంగా దాదాపు 10 శాతం వాటాతో జియో ప్లాట్​ఫాంలో అతిపెద్ద మైనారిటీ వాటాదారుగా అవతరించనుంది ఫేస్​బుక్.

jio reliance
రిలయన్స్ జియో ఫేస్​బుక్
author img

By

Published : Apr 22, 2020, 8:10 AM IST

రిలయన్స్ జియోలో పెట్టుబడులు పెట్టేందుకు సామాజిక మధ్యమ దిగ్గజం ఫేస్​బుక్​ సిద్ధమైంది. జియో ప్లాట్​ఫాం లిమిటెడ్​లోని మైనారిటీ(10శాతం) వాటా కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు జియో ప్లాట్​ఫాంలో 5.7 బిలియన్​ డాలర్ల(రూ.43,574 కోట్ల)ను పెట్టుబడి పెట్టనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.

"రిలయన్స్ ఇండస్ట్రీస్​ భాగస్వామ్య సంస్థ జియో ప్లాట్​ఫాం లిమిటెడ్​లో 5.7 బిలియన్ డాలర్లు(రూ.43,574కోట్ల)ను పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటిస్తున్నాం. దీంతో జియోలో ఫేస్​బుక్​ అతిపెద్ద మైనారిటీ వాటాదారుగా అవతరిస్తుంది."-ఫేస్​బుక్ ప్రకటన

రిలయన్స్ సంస్థ మరో ప్రకటనలో ఈ విషయాన్ని ధ్రువీకరించింది. పెట్టుబడి కోసం జియో ప్లాట్​ఫాం విలువ 4.62 లక్షల కోట్లుగా లెక్కగట్టినట్లు తెలిపింది. ఫేస్​బుక్ పెట్టుబడిని జియో ప్లాట్​ఫాంలో 9.99 శాతం వాటాగా అనువదించనున్నట్లు ప్రకటించింది.

ప్రస్తుతం జియో ప్లాట్​ఫాం పూర్తిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధీనంలో ఉంది. సంస్థ డిజిటల్ సేవలు సహా 38.8 కోట్ల చందాదారులతో దేశంలో అతిపెద్ద నెట్​వర్క్​గా అవతరించిన రిలయన్స్ జియో సైతం జియో ప్లాట్​ఫాం పరిధిలో ఉన్నాయి.

ఇదీ చదవండి: 12 రాష్ట్రాల్లోనే 92 శాతం 'వైరస్​' కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.