దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగిశాయి. కరోనా సంక్షోభం వేళ భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి తాము సిద్ధంగా ఉన్నామని అమెరికా సంకేతాలు ఇవ్వడం ఇందుకు కారణమైంది.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 114 పాయింట్లు వృద్ధిచెంది 30 వేల 932 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 39 పాయింట్లు లాభపడి 9 వేల 106 వద్ద స్థిరపడింది.
కేంద్ర ప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను రాష్ట్రాలకు రూ.15,340కోట్ల వస్తు సేవల పన్ను(జీఎస్టీ) పరిహారాన్ని విడుదల చేసింది. దీనితో పాటు పన్నుల వాటా కింద మే నెలకు గాను రూ.46,038.70 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించింది. సంక్షోభ సమయంలో రాష్ట్రాలకు ఇలా ఊతమివ్వడమూ సానుకూల ప్రభావం చూపింది.
లాభనష్టాల్లో..
ఐటీసీ, ఏషియన్ పెయింట్స్, హీరో మోటోకార్ప్, మారుతి సుజుకి, బజాజ్ ఆటో, సన్‌ఫార్మా, రిలయన్స్ రాణించాయి.
ఇండస్ఇండ్ బ్యాంకు, ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ, ఎల్ అండ్ టీ, ఓఎన్జీసీ, ఎస్బీఐ నష్టపోయాయి.
ఇదీ చూడండి: రాష్ట్రాలకు రూ.15,340కోట్ల జీఎస్టీ పరిహారం విడుదల