అమెరికాలో నిరుద్యోగం రేటు 50 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయిందన్న వార్తలు.... దేశీయ స్టాక్ మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపాయి. మాంద్యం ముప్పు నుంచి అగ్రరాజ్యం గట్టెక్కిందన్న అంచనాలతో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. బ్యాంకింగ్, ఆర్థిక రంగాల షేర్లు ప్రధానంగా లాభాల్లో కొనసాగుతున్నాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 200పాయింట్లకుపైగా లాభంతో 37వేల 895 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 50 పాయింట్లకుపైగా లాభపడి 11 వేల 230 వద్ద కొనసాగుతోంది.
ఎస్ బ్యాంకు షేర్లు 4శాతానికి లాభపడ్డాయి. హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ,వేదాంత, భారతీ ఎయిర్టెల్, కోల్ ఇండియా షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
ఇండస్ఇండ్ బ్యాంకు, హిరోమాటార్స్, సన్ ఫార్మా షేర్లు 2 శాతానికిపైగా నష్టపోయాయి.
ఇదీ చూడండి: కేబుల్ టీవీ కస్టమర్లకు శుభవార్త- ఇక రూ.130కే 150 ఛానళ్లు!