స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ- సెన్సెక్స్ దాదాపు 200 పాయింట్లు కోల్పోయి... 39 వేల 250 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ... 64 పాయింట్లు పతనమై.. 11 వేల 800 దిగువకు చేరింది. ప్రస్తుతం.. 11 వేల 760 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
వడ్డీ రేట్లపై జూన్ 19న అమెరికా ఫెడ్ నిర్ణయం వెలువడడానికి ముందు మదుపర్లు ఆచితూచి వ్యవహరించడమే నేటి నష్టాలకు కారణం.
లాభనష్టాల్లోనివివే....
ఇండియాబుల్స్ హెచ్ఎస్జీ, భారతి ఇన్ఫ్రాటెల్ లిమిటెడ్, యస్ బ్యాంక్, విప్రో, ఏషియన్ పెయింట్స్ అత్యధిక లాభాల్లో ఉన్నాయి.
జేఎస్‌డబ్ల్యూ స్టీల్, వేదాంత, టాటా స్టీల్, రిలయన్స్ నష్టాల జాబితాలో ఉన్నాయి.
రూపాయి ట్రేడింగ్ ఫ్లాట్‌గా ప్రారంభమైంది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే మారకం విలువ 69.80 వద్ద ఉంది.
అంతర్జాతీయంగా మార్కెట్లు ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నాయి.