37,800 స్థాయి దాటిన సెన్సెక్స్..
అంతర్జాతీయంగా సానుకూల సంకేతాల నడుమ దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో దూసుకెళ్తున్నాయి.
సెన్సెక్స్ 400 పాయింట్లకుపైగా లాభంతో 37,824 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 4 నెలల తర్వాత ఈ స్థాయికి చేరింది. నిఫ్టీ దాదాపు 110 పాయింట్ల వృద్ధితో 11,129 వద్ద ట్రేడవుతోంది.
- మారుతీ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్, కోటక్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
- హెచ్‌యూఎల్, బజాజ్ ఫిన్సర్వ్, ఐటీసీ, సన్‌ఫార్మా, ఐటీసీ, టెక్ మహీంద్రా నష్టాల్లో ఉన్నాయి.
- కరోనా వ్యాక్సిన్‌పై ఆశలు పెరుగుతున్నందున చివరి సెషన్లో అమెరికా మార్కెట్లు భారీగా పుంజుకున్నాయి. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్, అమెజాన్, టెస్లా వంటి కంపెనీలు భారీ లాభాలను గడించాయి. ఈ సానుకూలతల నేపథ్యంలో దేశీయంగా మదుపరులు కొనుగోళ్లపై దృష్టి సారిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
- ఆసియాలో ఇతర ప్రధాన స్టాక్ మార్కెట్లన్నీ కూడా లాభాల్లో ట్రేడవుతున్నాయి.
- ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ 0.18 శాతం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 43.36 డాలర్లుగా ఉంది.