ETV Bharat / business

మార్కెట్లకు మళ్లీ లాభాలు- ఐటీ, ఫార్మా జోరు

స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 355 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 95 పాయింట్ల లాభంతో 11,900 మార్క్​పైన స్థిరపడింది. ఫార్మా, ఐటీ షేర్లు లాభాలకు దన్నుగా నిలిచాయి.

stock market news Telugu
నేటి స్టాక్ మార్కెట్లు
author img

By

Published : Nov 4, 2020, 3:54 PM IST

Updated : Nov 4, 2020, 5:01 PM IST

స్టాక్ మార్కెట్లు బుధవారం కూడా లాభాలతో ముగిశాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 355 పాయింట్లు బలపడి.. 40,616 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 95 పాయింట్ల వృద్ధితో 11,908 వద్దకు చేరింది.

అమెరికా ఎన్నికల ఫలితాల సరళి డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి బైడెన్‌కు అనుకూలంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఐటీ షేర్లు సానుకూలంగా స్పందించాయి. ఫార్మా షేర్ల జోరు కూడా లాభాలకు కారణంగా తెలుస్తోంది. భారీ నష్టాల నుంచి తేరుకుని సానుకూలంగా స్పందించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు.. లాభాలకు ఊతమందించినట్లు స్టాక్ బ్రోకర్లు చెబుతున్నారు.

ఇంట్రాడే సాగిందిలా

సెన్సెక్స్ 40,693 పాయింట్ల అత్యధిక స్థాయి, 40,076 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 11,930 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 11,756 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

ఇండస్​ఇండ్ బ్యాంక్, సన్​ఫార్మా, రిలయన్స్, ఇన్ఫోసిస్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.

యాక్సిస్ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ, పవర్​గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్​టీపీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

మార్కెట్లో నేడు..

ఇతర మార్కెట్లు..

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో హాంకాంగ్ సూచీ మినహా.. షాంఘై, టోక్యో, సియోల్ సూచీలు లాభాలను నమోదు చేశాయి.

రూపాయి, ముడి చమురు..

కరెన్సీ మార్కెట్లో రూపాయి బుధవారం భారీగా 35 పైసలు తగ్గింది 74.76 వద్ద స్థిరపడింది.

ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ 0.38 శాతం పెరిగింది. బ్యారెల్ ముడి చమురు ధర 39.86 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి:క్యూ2లో ఎస్​బీఐ నికర లాభం 55 శాతం జంప్

Last Updated : Nov 4, 2020, 5:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.