స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతో ఆరంభం నుంచే సూచీల జోరు కనిపించింది.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 409 పాయింట్లు బలపడి 36,738 వద్దకు చేరింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 108 పాయింట్ల లాభంతో 10,813 వద్ద స్థిరపడింది.
ఆర్థిక, లోహ రంగ షేర్ల ర్యాలీ లాభాలకు దన్నుగా నిలిచాయి. సెషన్ ఆరంభంలో ఒడుదొడుకులు ఎదుర్కొన్న రిలయన్స్ షేర్లు.. చివరి గంటలో పుంజుకోవడం భారీ లాభాలకు కారణంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 36,806 పాయింట్ల అత్యధిక స్థాయి, 36,422 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 10,826 పాయింట్ల గరిష్ఠ స్థాయి.., 10,733 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
ఎస్బీఐ, బజాజ్ ఫినాన్స్, హెచ్డీఎఫ్సీ, టాటా స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్‌సీఎల్‌టెక్ లాభపడ్డాయి.
ఓఎన్జీసీ, టెక్ మహీంద్రా, హెచ్‌యూఎల్, మారుతీ, నెస్లే షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.
రూపాయి..
కరెన్సీ మార్కెట్లో రూపాయి గురువారం 3 పైసలు బలపడింది. డాలర్‌తో పోలిస్తే మారకం విలువ రూ.74.99 వద్ద ఫ్లాట్‌గా స్థిరపడింది.
ఇదీ చూడండి:ఆ పాలసీతో ఉద్యోగం పోయినా ఆర్థిక అండ!